Funky Collection: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ‘విశ్వక్ సేన్'(Vishwak Sen) నుండి వస్తున్న ‘ఫంకీ'(Funky Movie) చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే గట్టి నమ్మకం విడుదలకు ముందు ఆడియన్స్ లో ఉండేది. ఎందుకంటే ఈ చిత్రానికి డైరెక్టర్ అనుదీప్ KV(Anudeep KV) , గతంలో ఆయన ‘జాతి రత్నాలు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసాడు కాబట్టి. టీజర్ , ట్రైలర్, పాటలు కూడా మినిమం యావరేజ్ రేంజ్ సినిమా రాబోతుంది అనే ఇండికేషన్స్ ఇచ్చింది. అలా మంచి పాజిటివ్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అనుదీప్ స్టైల్ కామెడీ ని నచ్చే వాళ్లకు, ఈ చిత్రం పర్వాలేదు అనిపిస్తాది, ఆయన కామెడీ జోన్ ని ఇష్టపడని వాళ్లకు మాత్రం ఏమి చెత్త సినిమా ఇది, చాలా సిల్లీ గా ఉందని అనిపిస్తాది.
ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ విషయానికి వస్తే, ఒకప్పుడు విశ్వక్ సేన్ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ వసూళ్లు వస్తుండేవి. ‘గామీ’ చిత్రం వరకు ఆ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. కానీ ‘మెకానిక్ రాకీ’ నుండి ఆయన ఓపెనింగ్స్ స్టామినా తగ్గిపోతూ వచ్చింది. ‘లైలా’ ఓపెనింగ్స్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అనుదీప్ KV లాంటి డైరెక్టర్ తో చేస్తున్నాడు కదా, ఈ సినిమాకు కచ్చితంగా మినిమం గ్యారంటీ రేంజ్ ఓపెనింగ్ దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు, డివైడ్ టాక్ ప్రభావం చాలా గట్టిగానే పడింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి మొదటి రోజు 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఒకప్పుడు కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ఓపెనింగ్స్ ని పెట్టే సత్తా ఉన్న విశ్వక్ సేన్, ఇప్పుడు కోటి రూపాయిల కంటే తక్కువ షేర్ ని రాబట్టే స్థాయికి పడిపోయాడంటే, ఆడియన్స్ లో ఆయన సినిమాలపై ఆసక్తి బాగా తగ్గిపోయింది అనే విషయం అర్థం అవుతోంది.
ఓవరాల్ గా ఇండియా వైడ్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక బుక్ మై షో యాప్ లో అయితే ఈ చిత్రానికి మొదటి రోజు 35 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక్కడి బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇలా ఉంటే, ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది అనే చెప్పాలి. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి లక్షా 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘లైలా’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత వచ్చిన సినిమా అయినప్పటికీ, ఇంత మంచి గ్రాస్ వచ్చిందంటే కచ్చితంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక్కడ మాత్రం అనుదీప్ బ్రాండ్ ఉపయోగపడింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.