From Sushmita to Harnaaz: కొద్ది గంటలుగా హర్నాజ్ కౌర్ సంధు అనే పేరు ఇండియాలో సంచలనంగా మారిపోయింది. అప్పటి వరకు ఈ పేరే ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ ఒక్కసారిగా దేశమంతా ప్రశంసలు కురిపిస్తోంది. అందుకు కారణం 2021 ఏడాదికి మిస్ యూనివర్స్ టైటిల్ నెగ్గడమే. ఈ మిస్ యూనివర్స్ కిరీటం మన దేశానికి వచ్చి దాదాపు 20ఏండ్లు గడిచిపోయాయి. దీన్ని గెలుచుకునేందుకు ఈ 20 ఏళ్లలో చాలామంది అమ్మాయిలు పోటీ పడ్డారు. కానీ ఎవరూ దక్కించుకోలేకపోయారు. ఇక ఇన్నేళ్ల తర్వాత హర్నాజ్ ఆ ఘనగ సాధించింది.

ఇజ్రాయిల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 80 మందిని వెనక్కు నెట్టి మరీ ఇండియాకు మిస్ యూనివర్స్ టైటిల్ తీసుకొచ్చింది హర్నాజ్ కౌర్. అయితే ఇప్పటి వరకు మిస్ వరల్డ్ టైటిల్ దాదాపు 5 సార్లు మన ఇండియాకు దక్కింది. మరి ఇప్పటి దాకా ఎంతమంది అమ్మాయిలు కిరీటాలు తెచ్చారో చూద్దాం. హర్నాజ్ కౌర్‌కు ముందు 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ దక్కించుకుంది. ఇక ఇదే మిస్ యూనివర్స్ టైటిల్‌ను లారా దత్తా 2000 సంవత్సరంలో గెలుచుకుంది.
ఇక బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ ను దక్కించుకుంది. ఇక అంతకంటే ఒక ఏడాది ముందు యుక్తా ముఖి 1999లో మిస్ వరల్డ్ ను పొందింది. 1997లో కూడా మిస్ వరల్డ్ కిరీటాన్ని డయానా హెడెన్ ఇండియాకు తీసుకువచ్చింది. ఇక మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ కూడా 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.
Also Read: Harnaaz Sandhu: విశ్వసుందరి హర్నాజ్ సంధు గెలుపు రహస్యమేంటీ?
అదేంటంటే ఇదే ఏడాది సుష్మితా సేన్ కూడా మిస్ యూనివర్స్ టైటిల్ తో విజయ కేతనం ఎగరేసింది. ఒకే ఏడాదిలో ఇలా రెండు టైటిల్స్ తీసుకొచ్చిన ఘనత 1994లో అలాగే 2000 సంవత్సరంలో మన ఇండియాకు దక్కింది. అయితే ఈ కిరీటాలు గెలిచిన వారిలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లే ఉండటం విశేషం. ఇక దాదాపు 20 ఏండ్ల తర్వాత ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటం రావడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.