Anchor Ravi: గతంలో ఎన్నడూ లేనంతగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ సీజన్ మీద దారుణంగా కామెంట్లు ట్రోలింగ్ నడుస్తున్నాయి. దీనిపై అటు కంటెస్టెంట్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. షణ్ముఖ్, సిరి రిలేషన్ మీద ఇప్పటికీ నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. వారిద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక వీరిద్దరి మీద బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల కూడా మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఈ ట్రోలింగ్ విషయం ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల దాకా వెళ్లింది.
అయితే అది షణ్ముఖ్, సిరిల విషయంలో కాదండోయ్. యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మీద, తన భార్య, కుమార్తె మీద దారుణంగా ట్రోల్ చేస్తున్నారని, దారుణమైన కామెంట్లు పెడుతున్నారంటూ నెటిజన్లు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ కుటుంబం మీద చేసిన ట్రోలింగ్‌కు సంబంధించిన వాటిని స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. భార్య నిత్యతో పాటు కుమార్తె వియాను కూడా ఇందులోకి లాగడాన్ని ఆయన సహించలేకపోతున్నారు.
మహిళలు, చిన్న పిల్లలపై ఎలా ట్రోల్స్ చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రవి టాప్ -5 కంటెస్టెంట్లలో ఉంటారని అంతా అనుకున్నారు. ఆయన మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటే.. సడెన్‌గా బయటకు వచ్చేశారు. అయితే రవి హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఆయన మీద ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. చాలా నిక్ నేమ్స్ రావడంతో వాటి మీద నెటిజన్లు మీమ్స్‌ను క్రియేట్ చేశారు. ఇక మరీ దారుణంగా అతని మీద గుంటనక్క అనే ముద్ర రావడంతో ఎక్కడ చూసినా ఇదే పేరును పెట్టేశారు నెటిజన్లు.
Also Read: Shyam Singaroy Movie: నాని “శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే…
కంటెస్టెంట్ల మధ్య ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటాడనే ముద్ర పడింది. కావాలని ఇతరులను ఇరికిస్తాడనే కామెంట్లు పెరిగిపోయాయి. ఇవే చివరకు అతన్ని ఎలిమినేషన్ వరకు తీసుకెళ్లాయనే వాదన కూడా ఉంది. ఇక రవి విషయంలో చాలాసార్లు కంటెస్టెంట్లు కూడా విరుచుకు పడ్డారు. రవి కావాలనే ఇతరులను ఇరికించేసి తన గేమ్‌ను మాత్రం చాలా సేఫ్ గా ఆడుతుంటాడని చెప్పుకొచ్చారు. ఇలా మొదటి నుంచి రవి చుట్టూ వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అవి కాస్తా ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేలా చేశాయి.
Also Read: Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ…