Nag Ashwin: ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్ హీరోల హవా కొనసాగింది. ఎంతలా అంటే సౌత్ లో ఉన్న సినిమాలను బాలీవుడ్ హీరోలు అసలు లెక్క చేసే వాళ్ళు కాదు. ఎందుకంటే హీరోలు అంటే మేమే…మాకు ఎవరూ పోటీ లేరు, మాతో ఎవరు పోటీకి రారు అనేంతలా గర్వంతో విర్రవీగిపోయిన వాళ్లు ప్రస్తుతం సక్సెస్ లు లేక మన దర్శకులను మచ్చిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా సందీప్ వంగ ను షారుఖ్ ఖాన్ తన ఇంటికి పిలిపించుకొని తనతో సినిమా చేయమని అడిగినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా కల్కి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి నాగ్ అశ్విన్ సిద్ధంగా ఉన్నాడు. ఇక ముందు నుంచే మన దర్శకులను మచ్చిక చేసుకునే పనిలో బాలీవుడ్ హీరోలు ఉన్నారు. ఇక అందులో భాగంగానే అమీర్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో చాలా చనువుగా మెదులుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి సినిమా చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ సినిమాతో మరొక సారి తెలుగు సినిమా తమ సత్తాని చూపించుకోబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక దాంతో చేసేది ఏమీ లేక మన దర్శకులను మంచి చేసుకొని ఎలాగైన వాళ్ళతో సినిమాలు చేసి సక్సెస్ లు అందుకోవడం ఒకటే దారి అన్నట్టుగా బాలీవుడ్ హీరోలా వైఖరి అయితే నడుస్తుంది. ఇక అందువల్లే వాళ్ళు మన దర్శకులను టార్గెట్ చేసి వారిని మంచి చేసుకునే పనులో బిజీగా ఉన్నారు…
మరి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనవాళ్ళు వాళ్లతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా ముగిసిన వెంటనే నాగ్ అశ్విన్ తెలుగులో మరొక స్టార్ హీరోతో సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు. మరి ఇలాంటి క్రమంలో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి అతను ఎంతవరకు ఆసక్తి చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…