https://oktelugu.com/

సీసీసీ ఆధ్వర్యంలో సినీ వ్యాక్సినోత్సవం !

కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ మెగాస్టార్ గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, వారి పాలిట దేవుడు అయ్యారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం చేపట్టి, కరోనా మహమ్మారి నుండి సినీ జనాన్ని కాపాడారు. ఇటీవల చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ […]

Written By: , Updated On : June 12, 2021 / 05:48 PM IST
Follow us on

Free vaccinationకరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ మెగాస్టార్ గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, వారి పాలిట దేవుడు అయ్యారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం చేపట్టి, కరోనా మహమ్మారి నుండి సినీ జనాన్ని కాపాడారు. ఇటీవల చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది.

ఇక ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మాట్లాడుతూ.. కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికి ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవిగారి చేతుల మీదుగా ఇటీవల ప్రారంభమైంది.

అప్పటినుండి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 4000 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఫెడరేషన్ సభ్యులు, సినీ పాత్రికేయులు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం. అలాగే, మిగతా సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వ్యాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి.

అప్పుడే షూటింగ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి, కాబట్టి అందరూ ముందుకు రండి. వ్యాక్సిన్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం, అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ ఎన్ శంకర్ చెప్పుకొచ్చాడు.