Hyderabad Lalita Kala Thoranam: హైదరాబాద్ లో ఉచితంగా సినిమాలను ప్రదర్శించబోతున్నారని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రసారం సాగుతోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే , ఇది రెగ్యులర్ మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ప్రదర్శించడం లేదు. కొత్త సినిమాల ప్రదర్శన కూడా కాదు. హైదరాబాద్ లోని ప్రభుత్వ బహిరంగ కళా వేదిక ‘లలిత కళా తోరణం’ ఓపెన్ థియేటర్ లో ప్లాన్ చేశారు. స్థానిక కళాక్షేత్రాలను సజీవంగా ఉంచాలనే గొప్ప ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సినీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 14 న ఈ ఉచిత సినిమాల ప్రదర్శన కార్యక్రమం మొదలైంది. మొత్తం 5 రోజుల పాటు ఈ వేదికపై సినిమాల పండుగ జరగనుంది. అంటే ఏప్రిల్ 18 వరకు ఈ ప్రదర్శనలు ఉండబోతున్నాయి అన్నమాట. అందుకోసం అత్యాధునిక జైన్ట్ LED స్క్రీన్ ని ఏర్పాటు చేశారు.
ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన మొదలు అవుతుంది. మొత్తం మీద 4000 వేల మంది ప్రేక్షకులు కూర్చొని ఇందులో సినిమా చూడొచ్చు. మనం వెళ్లే థియేటర్స్ సామర్థ్యం వెయ్యి లోపల సీటింగ్ కెపాసిటీ తో ఉంటుంది. అంత తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్స్ లో కూర్చొని చూస్తేనే అద్భుతమైన అనుభూతిని పొందుతుంటాము , అలాంటిది ఇంత పెద్ద ఓపెన్ ఆడిటోరియం లో కూర్చొని చూస్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆ అనుభూతిని ఉచితంగా పొందే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. కాబట్టి మూవీ లవర్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ ఓపెన్ ఆడిటోరియం లో 4000 మంది ప్రేక్షకుల చప్పట్లు , కేరింతల మధ్య సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి. ఏ రోజు ఏ సినిమాని ప్రదర్శిస్తారో ఒకసారి వివరంగా ఇందులో చూద్దాం.
నిన్న గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘కోర్ట్’ చిత్రాన్ని ప్రదర్శించగా, నేడు అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అదే విధంగా రేపు బలగం చిత్రాన్ని ప్రదర్శించబోతుండగా, చివరి రోజున, అనగా ఏప్రిల్ 18 న ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరం లోని సినీ అభిమానులంతా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరింది. నిన్న, మొన్న ప్రదర్శనలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియో లు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.