Vishnu Priya Controversy: గత కొద్దిరోజుల నుండి ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ఎక్సక్లూసివ్ కంటెంట్ ఫీచర్ ని ఉపయోగించుకొని , అందులో యువత ని రెచ్చగొట్టే విధంగా అర్థ నగ్న ఫోటోలను షేర్ చేస్తుందని, ఇలా చేయడం చాలా తప్పని , వెంటనే విష్ణు ప్రియా ఇన్ స్టాగ్రామ్ ఐడీ ని బ్లాక్ చెయ్యాలని , ఆమె చర్యలు తీసుకోవాలని ఇటీవలే కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో దీనిపై చర్చ నడిచింది. న్యూస్ చానెల్స్ ఈ అంశంపై ప్రైమ్ డిబేట్స్ కూడా నడిచాయి. ఇంత జరుగుతున్నప్పటికీ విష్ణు ప్రియా నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
పైగా ఆమె తనపై కేసు వేసినవాళ్లపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా ‘నా నుండి ఎక్సక్లూసివ్ కంటెంట్ ని చూడాలని అనుకునేవాళ్లు , ఈ లింక్ ని క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ అవ్వండి’ అంటూ స్టోరీ లో అప్డేట్ చేయడం హైలైట్ గా నిల్చింది. విష్ణు ప్రియ మీద పోలీస్ కేసు వెయ్యకముందు , ఆమె సబ్ స్క్రైబర్స్ కౌంట్ కేవలం 1700 మంది మాత్రమే. కానీ ఆమెపై కేసు వేయడం వల్ల, దాని గురించి ఒక రేంజ్ లో మీడియా చర్చలు జరగడం వల్ల, కుర్రాళ్ళు మొత్తం విష్ణు ప్రియ అర్థ నగ్న ఫోటోలు చూడడం కోసం , సబ్ స్క్రిప్షన్ తీసుకోవడానికి ఎగబడ్డారు. ఇప్పుడు ఆమె సబ్ స్క్రైబర్స్ సంఖ్య అక్షరాలా 6736 మందికి చేరింది. ఒక్కో షబ్ స్క్రిప్షన్ కి ఆమె 390 రూపాయిలు తీసుకుంటుంది. కొద్దిరోజుల క్రితం 1700 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి కేవలం 6 లక్షల 63 వేల రూపాయిలు మాత్రమే ఆమె ఆర్జించేది.
కానీ ఇప్పుడు ఏకంగా అది 26 లక్షల 27 వేలకు చేరింది. అంటే దాదాపుగా ఈ నాలుగు రోజుల్లో ఆమెకు దొరికిన ఫ్రీ పబ్లిసిటీ కారణంగా , మరో 20 లక్షల రూపాయిలు అదనంగా వచ్చింది అన్నమాట. ఈ సబ్ స్క్రిప్షన్స్ ఇక్కడితో ఆగేలా లేదు. రోజురోజుకి ఆ సంఖ్య పెరుగుతూ పోతుంది. రాబోయే రోజుల్లో ఈమె నెలకు కోటి రూపాయిలు సంపాదించే రేంజ్ కి ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి కెరీర్ పరంగా విష్ణు ప్రియ మంచి పీక్ రేంజ్ ని చూస్తుంది. జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘ఆట’ డ్యాన్స్ షో లో ఒక ప్లేయర్ గా వ్యవహరిస్తున్న విష్ణు ప్రియా, రీసెంట్ గానే ఆహా మీడియా లోని పాపులర్ గేమ్ షో ‘సర్కార్ 6’ లో సుడిగాలి సుధీర్ తో కలిసి కో హోస్ట్ గా వ్యవహరిస్తోంది.