Mohan Babu And Rajashekhar: సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది… వీలైతే నటుడిగా రాణించాలనే కోరిక కూడా ఉంటుంది…కానీ దాని కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనే విషయాల గురించి ఎవరు ఆలోచించారు…ఇక్కడ హీరోలుగా రాణించాలంటే అనునిత్యం శ్రమించాల్సిన అవసరమైతే ఉంది… ఏ కొంచెం నిర్లక్ష్యం వహించిన కూడా వాళ్ల కెరియర్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశమైతే ఉంది… ఒకప్పుడు పవర్ ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోలందరు వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల హీరోలుగా కెరియర్ ను కోల్పోయారు. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మోహన్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాలో విలన్ గా తను సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మనం వింటేజ్ మోహన్ బాబుని చూడొచ్చు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాతో సక్సెస్ సాధించి మోహన్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించినా కూడా తర్వాత చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరమైతే ఉంది… ఒకప్పుడు వైవిధ్యమైన పాత్రలను పోషించిన మోహన్ బాబు ఇప్పుడు ఈ సినిమాలో కూడా డిఫరెంట్ పాత్రను ఎంచుకొని చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…
మోహన్ బాబు తో పాటుగా ప్రస్తుతం రాజశేఖర్ కూడా విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. ఆయన కూడా ఇకమీదట విలన్ పాత్రలు చేసి గొప్ప గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు హీరోలుగా చేసిన వీళ్లంతా ఇప్పుడు విలన్లుగా మారి భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్లుగా మారి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. మరి వీళ్ళు కూడా వాళ్ళలాగే మంచి సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మీదట వీళ్ళ విలనిజానికి తెలుగు ఇండస్ట్రీ షేక్ అవుతుందని వాళ్ల అభిమానులు భావిస్తున్నారు…