Former Minister Roja : ఈమధ్య కాలం లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. కేవలం సినీ రంగం, సాఫ్ట్ వేర్ రంగం లో మాత్రమే కాదు, ఇతర రంగాల్లో కూడా ఈ తరం ప్రేమికులు కలిసి ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతున్నాయి. కలిసి జీవితాంతం నడవాలని అనుకున్న వాళ్ళు, ఎందుకు ఇలా మధ్యలోనే విడాకులు తీసుకొని వెళ్లిపోతున్నారు?, విడాకులు అనే అంశం కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది మాత్రమే కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన గౌరవం కూడా. సంవత్సరాల తరబడి ప్రేమించుకొని, డేటింగ్ చేసుకున్నప్పుడు రాని ఇలాంటి ఆలోచనలు, కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు వస్తున్నాయి అనేది పెద్దల వాదన. ఈ విడాకుల వ్యవహారం గురించి ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘ విడాకుల వ్యవహారాలు కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాదు, సాఫ్ట్ వేర్ రంగం లో కూడా తరచూ జరుగుతూనే ఉన్నాయి. పెళ్ళైన నెలరోజులకు విడిపోయి, వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నవాళ్ళని నేను చాలామందిని చూసాను. ఈమధ్య కాలం లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. ఒక భార్య భర్త మధ్య ఏదైనా సమస్య వస్తే, అతని వైపు తప్పు ఉన్నప్పుడు నేనెందుకు తగ్గాలి?, నేను కూడా అతనితో సమానంగా సంపాదిస్తున్నాను అని భార్య అనుకోవచ్చు, భర్త కి కూడా అదే తరహా ఫీలింగ్ ఉండొచ్చు. ఇలా ఎవ్వరూ తగ్గకపోవడం వల్లే విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ నాకు అర్థం కానిది ఒక్కటే, ఒకరితో ఒకరు సర్దుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్లడమే సంసారం. అలా ఒకరితో సర్దుకోలేక విడిపోయేవాళ్ళు, మరొకరితో సర్దుకొని పోగలరని ఎలా అనుకుంటారు?’ అంటూ విడాకుల అంశం పై ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
రోజా 2002 వ సంవత్సరం లో సెల్వమణి అనే ప్రముఖ తమిళ టాప్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సాధారణంగా తమ భార్యలను రాజకీయాల్లోకి పంపాలని ఏ భర్త కూడా కోరుకోడు. కానీ రోజా ని మాత్రం ఆమెకు ఇష్టమొచ్చినట్టు బ్రతికే స్వేచ్చని ఇచ్చాడు భర్త సెల్వమణి. ఒకవిధంగా చూస్తే రోజా శాసనసభ్యురాలిగా మారి, మంత్రిగా కూడా పని చేసి ఎంతో ఎత్తుకి ఎదిగింది. ఆమె ఆ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా భర్త లో ఎలాంటి అసూయ లేదు. ముమ్మాటికీ రోజా స్థాయి తో పోలిస్తే ప్రస్తుతానికి సెల్వమణి స్థాయి తక్కువే. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఇన్నేళ్లు ఎలాంటి భేదభావాలు రాలేదు. ఒకరికొకరు కలిసిమెలిసి ఉన్నారు. దాంపత్యానికి అసలు సిసలు నిర్వచనం అంటే ఇదే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటోళ్లని ఆదర్శంగా తీసుకోవాలని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.