Allu Arjun : ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arju) ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక రీలోడెడ్ వెర్షన్ తో మరొక 20 నిమిషాలు అదనం గా కలిపి సినిమాను రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికి రీలోడెడ్ వెర్షన్ కూడా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం విశేషం…ఇక రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి రికార్డు లెవెల్లో వ్యూయర్ షిప్ అయితే దక్కుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలావరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.అలాగే అల్లు అర్జున్ సైతం ఈ సినిమాతో ఆయనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకున్నాననే సంతోషంతో మురిసిపోతున్నాడనే చెప్పాలి. మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…ఇక అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి ముగ్గురు హీరోలు ప్రయత్నం చేసి ఎలాగైనా సరే తనని బీట్ చేసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందులో రామ్ చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), మహేష్ బాబు (Mahesh Babu) లు ఉండడం విశేషం… వీళ్ళు ముగ్గురు సైతం అల్లు అర్జున్ కంటే పెద్ద హీరోలుగా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయితే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డు బ్రేక్ అయిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక రామ్ చరణ్ సైతం ఇప్పుడు బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాతో 2000 కోట్ల కలెక్షన్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టార్గెట్ కూడా 2000 కోట్ల కలెక్షన్స్ కావడం విశేషం… ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోల టార్గెట్ 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కావడంతో ఇండస్ట్రీ అంతా 2000 కోట్ల జపం చేస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మన హీరోలు చాలా వరకు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇక మీదట కూడా అలాంటి విజయాలు నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…మరి రాబోయే సినిమాలతో ఏ హీరో ఎలాంటి సక్సెస్ లను దక్కించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…