https://oktelugu.com/

Dil Raju: ఈ సంక్రాంతికి 70 శాతం థియేటర్స్ దిల్ రాజు కి వెళ్లిపోయాయిగా..6 ఏళ్ళ నష్టాలను పూడ్చదానికి మాస్టర్ ప్లాన్!

వకీల్ సాబ్ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాలలో బలగం, F3 చిత్రాలు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. గత ఏడాది విడుదలైన 'శాకుంతలం', ఏడాది ప్రారంభం లో విడుదలైన 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచి దిల్ రాజు కి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 02:46 PM IST

    Dill Raju

    Follow us on

    Dil Raju: ఇండస్ట్రీ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, నితిన్ దిల్ సినిమాతో నిర్మాతగా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా మెగా బ్లాక్ బస్టర్ అవ్వడంతో దిల్ రాజు నిర్మాతగా నిలదొక్కుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ‘ఆర్య’ చిత్రం చేసాడు. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టింది. అప్పటి నుండి దిల్ రాజు కూడా నిర్మాతగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సక్సెస్ లు అందుకుంటూ, దిల్ రాజు సినిమా అంటేనే సూపర్ హిట్ అనే బ్రాండ్ ఇమేజ్ ని జనాల్లో ఏర్పాటు చేయగలిగాడు. కానీ రీసెంట్ గా ఆ బ్రాండ్ ఇమేజ్ మసకబారింది. గత ఆరేళ్ళ నుండి ఆయన వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలనే అందుకుంటూ ఉన్నాడు.

    వకీల్ సాబ్ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాలలో బలగం, F3 చిత్రాలు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. గత ఏడాది విడుదలైన ‘శాకుంతలం’, ఏడాది ప్రారంభం లో విడుదలైన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచి దిల్ రాజు కి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆ సమయం లో దిల్ రాజు ని డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యి లాభాలని తెచ్చిపెట్టడంతో సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకీ అర్జెంటు గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. నిర్మాతగా గత 6 సినిమాలతో పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలి. అందుకే తనకు ఎంతగానో కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ ని నమ్ముకున్నాడు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10వ తారీఖున విడుదల కాబోతుంది.

    అదే విధంగా ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా జనవరి 14 న విడుదల చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 70 శాతం కి పైగా థియేటర్స్ ని దిల్ రాజు ఇప్పటికే బుక్ చేసి పెట్టుకున్నాడట. బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి కేవలం 30 శాతం థియేటర్స్ మాత్రమే సంక్రాంతికి అందుబాటులో ఉండనున్నాయి. దీనిని బట్టి దిల్ రాజు రెండు సినిమాలకు టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రంలో కేవలం ఆయన సాంగ్స్ చిత్రీకరణ కోసమే వంద కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టాడట. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడితేనే దిల్ రాజు సేవ్ అవుతాడు. చూడాలి మరి ఆయన అదృష్టం ఎలా ఉండబోతుంది అనేది.