Rajamouli fridge: డైరెక్టర్ రాజమౌళి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో సీన్ కోసం ఆయన ఎంతో కష్ట పడుతుంటారు. అవుట్ సరిగ్గా వచ్చేందుకు వరకు వాటిని చెక్కుతూనే ఉంటారు. అందుకే ఆయనకు ఇండస్ట్రీలో ‘జక్కన్న’ అనే పేరు వచ్చింది.
రాజమౌళి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో హిట్టు కొట్టి తానేంటో నిరూపించాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘మగధీర’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘యమదొంగ’, డార్లింగ్ ప్రభాస్ తో ‘బాహుబలి’ వంటి సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే హీరో నాని-సమంతలతో ‘ఈగ’ అనే ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రధానంగా ఈగ చుట్టూనే తిరుగుతుంది.
ప్రతీఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా ‘ఈగ’తో మూవీని తీయడమే కాకుండా ఈ సినిమా పలు జాతీయ అవార్డులను తీసుకొచ్చారు. 2012లో విడుదలైన ఈ మూవీకి మూడు సైమా అవార్డులతో పాటు ఐదు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయంటే దానికి రాజమౌళి కృషినే కారణం. ఈ సినిమా సికెట్స్ ను తారక్, చెర్రీలు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లో భాగంగా రివీల్ చేశారు.
‘ఈగ’ సినిమా సమయంలో రాజమౌళి ఇంట్లోని ఫ్రీజ్ లో మొత్తం ఈగలే ఉండేవని చెప్పారు. ఫ్రిజ్ లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని జూనియర్ చెప్పారు. ఆ వెంటనే రాంచరణ్ ఈగల సూప్తావస్థను తెలుసుకునేందుకు ఆయన అలా చేశారని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఎంతో రీసెర్చ్ చేసి ఈగను తెరకెక్కించారని అందువల్లే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందని చెప్పారు.