Mokshajna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్… అదిరిపోయే సబ్జెక్టు!

2024లో మోక్షజ్ఞ హీరో అవుతాడంటూ హామీ ఇచ్చాడు. మరి ఈసారైనా బాలయ్య మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి...

Written By: NARESH, Updated On : October 22, 2023 8:00 pm
Follow us on

Mokshajna : సినిమాల్లో వారసత్వం వెరీ కామన్. అది ఒక బలమైన సెంటిమెంట్. నెపోటిజమ్ అని కొందరు విమర్శలు చేసినా… జనాలు అదే కోరుకుంటారు. ఓ స్టార్ హీరో కొడుకు ఖచ్చితంగా హీరోనే కావాలి. కాదంటే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయి. తరతరాలు తమ అభిమాన పరంపర కొనసాగాలని అనుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఘన చరిత్ర ఉంది. నందమూరి తారక రామారావు దశాబ్దాల పాటు పరిశ్రమను ఏలారు. ఆయన కుమారుల్లో ఒకరైన బాలకృష్ణ తండ్రి వారసత్వం నిలబెడుతూ స్టార్ హీరో అయ్యారు.

మూడో తరం వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ దున్నేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నాడు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నిరాశపరుస్తున్నాడు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞను నిఖార్సయిన వారసుడిగా నమ్ముతున్నారు. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ అతన్ని హీరోగా చూడాలి అనుకుంటున్నారు. వాళ్ళ నిరీక్షణ మోక్షజ్ఞకు టీనేజ్ వచ్చినప్పటి నుండి కొనసాగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరో అయ్యాడు. 19 ఏళ్లకు బ్లాక్ బస్టర్ కొట్టాడు. సరిగ్గా మీసం మొలవకుండానే స్టార్ అయ్యాడు. మోక్షజ్ఞ ప్రస్తుతం 30 ఏళ్లకు దగ్గరయ్యాడు. కానీ ఒక్క సినిమా చేయలేదు. బాలయ్య మాత్రం ప్రతి ఏడాది వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ అంటారు. తాజాగా మరోసారి ఇదే తరహా కామెంట్స్ చేశాడు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీలీల బాలయ్యను మోక్షజ్ఞ హీరో ఎప్పుడు అవుతన్నాడని అడిగింది.

వచ్చే ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుంది. కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఆదిత్య 999 మ్యాక్స్ కథ నేను రాశాను. ఈ కథ ఒక్కరాత్రిలో సిద్ధం చేశాను. ఈ సబ్జెక్టుతోనే మోక్షజ్ఞ మొదటి చిత్రం ఉండవచ్చు. లేదా వేరొక కథతో చేయవచ్చు. మోక్షజ్ఞ కెరీర్ గురించి నాకు ఎలాంటి బాధా లేదు. 2024లో మోక్షజ్ఞ హీరో అవుతాడంటూ హామీ ఇచ్చాడు. మరి ఈసారైనా బాలయ్య మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి…