Varun Tej- Lavanya Tripathi Love Story
Varun Tej- Lavanya Tripathi Love Story: లావణ్య త్రిపాఠి మెగా కోడలు కావడం ఊహించని పరిణామం. గత రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కడో ఒక సందిగ్ధత ఉండేది. రెండు రోజుల క్రితం ఊహాగానాలు, అనుమానాలు పటాపంచలు చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించారు. జూన్ 9న మణికొండలో గల నాగబాబు నివాసంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ సతీసమేతంగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు.
అసలు వరుణ్-లావణ్యల ప్రేమ కహాని ఎక్కడ మొదలైంది. ఎలా ఒక్కటయ్యారని తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వీరు గత ఐదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. 2017లో దర్శకుడు శ్రీను వైట్ల మిస్టర్ టైటిల్ తో ఒక మూవీ చేశారు. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. మిస్టర్ మూవీ వరుణ్ కి చేదు అనుభవం మిగిల్చింది. అయితే ఓ చక్కని తోడు ఆయనకు అందించింది.
మిస్టర్ మూవీ సెట్స్ లో లావణ్య పట్ల వరుణ్ ఆకర్షితుడు అయ్యాడట. లావణ్యతో ఆయన చనువుగా ఉండటంగా ఆమె కూడా వరుణ్ అంటే అభిమానం పెంచుకుందట. మిస్టర్ మూవీ ఫలితంలో సంబంధం లేకుండా లావణ్య-వరుణ్ తేజ్ సన్నిహితంగా ఉండటం స్టార్ట్ చేశారట. చెప్పాలంటే అప్పుడే వీరి రిలేషన్ బలపడిందట. ఒక రోజు వరుణ్ నేరుగా పెళ్లి చేసుకుందామా? అని అడిగాడట. అప్పటికే వరుణ్ అంటే ఇష్టం పెంచుకున్న లావణ్య ఎస్ అన్నారట.
అలా వారి ప్రేమ మొదలైందట. ఐతే ఈ విషయాన్ని ఇద్దరూ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. 2018లో అంతరిక్షం మూవీలో కలిసి నటించారు. వరుణ్-లావణ్యల ఎఫైర్ నిహారిక పెళ్లి సాక్షిగా బయటపడింది. నిహారిక 2020 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ వివాహం చేసుకుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పరిశ్రమ నుండి లావణ్య, రీతూ వర్మ హాజరుకావడం హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుండి మీడియా వర్గాలు లావణ్య-వరుణ్ పై నిఘా పెట్టారు. అలా వీరి రిలేషన్ పై క్లారిటీ వచ్చింది. మేము కేవలం స్నేహితులమే ఆమె చెప్పుకొస్తున్న లావణ్య త్రిపాఠి సడన్ గా పెళ్లి ప్రకటన చేసి షాక్ ఇచ్చింది. ఐదేళ్లు తమ బంధం గోప్యంగా ఉంచి, పెళ్లి ప్రకటన నేరుగా చేశారు.