https://oktelugu.com/

ఫస్ట్ లుక్: పెళ్లికోసం పరితపించే ‘ప్రేమ్ కుమార్’

ఏక్ మినీ కథ’ లాంటి బోల్డ్ కథతో మెప్పించిన యువ హీరో సంతోష్ శోభన్. ‘వర్షం’ మూవీ దర్శకుడు శోభన్ కుమారుడే ఇతడు. మొదట తెలుగులో ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇటీవల ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోల్డ్ కథతో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. యువ హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన పురుషాంగం చిన్నగా ఉందని ఆత్మన్యూనతతో బాధపడే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2021 / 02:19 PM IST
    Follow us on

    ఏక్ మినీ కథ’ లాంటి బోల్డ్ కథతో మెప్పించిన యువ హీరో సంతోష్ శోభన్. ‘వర్షం’ మూవీ దర్శకుడు శోభన్ కుమారుడే ఇతడు. మొదట తెలుగులో ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇటీవల ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోల్డ్ కథతో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. యువ హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి.

    తన పురుషాంగం చిన్నగా ఉందని ఆత్మన్యూనతతో బాధపడే యువకుడిగా సంతోష్ శోభన్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆ హిట్ తో జోష్ మీదున్న సంతోష్ తాజాగా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ తో కొత్త సినిమాను ప్రకటించాడు. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీసింగ్ హీరోయిన్. శివప్రసాద్ పన్నీరు నిర్మాత.

    శుక్రవారం ‘ప్రేమ్ కుమార్’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. పెళ్లికొడుకు గెటప్ లో చేతిలో తాళి పట్టుకొని భూతద్ధంలో చూస్తున్న సంతోష్ శోభన్ కార్టూన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సారి పెళ్లి సమస్యతతో సతమతమయ్యే అబ్బాయిగా నవ్వులు పూయించబోతున్నాడని తెలుస్తోంది.

    పెళ్లి పీటల మీద కూర్చుకున్న పెళ్లికొడుకు తన పెళ్లి అవ్వడం లేదనే ఫస్ట్రేషన్ లో ఏం చేశాడనేది ‘ప్రేమ్ కుమార్ ’ కథ అని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తయ్యిందన్నారు.