Homeఎంటర్టైన్మెంట్Bala Krishna: ఫుల్ ట్రెండింగ్ లో బాలయ్య "అన్ స్టాపబుల్"... ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Bala Krishna: ఫుల్ ట్రెండింగ్ లో బాలయ్య “అన్ స్టాపబుల్”… ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ తనలోని తనలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో … ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు బాలయ్య. మాటల్లో ఫిల్టర్ ఉండదు… సరదాలో స్టాప్ ఉండదు, సై అంటే సై… నై అంటే నై’ అంటూ ‘అన్ స్టాపబుల్’ టాక్ షోపై అంచనాలు పెంచేశారు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకూ ఆయన్ను చాలామంది ఇంటర్వ్యూ చేశారు. ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే… ఆయన సెలబ్రిటీలను ఎలా ఇంటర్వ్యూ చేస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.  ఈ సస్పెన్స్ కు తెర దించుతూ అభిమానులకు ఓ సూపర్ గిఫ్ట్ ఇచ్చింది ఆహా టీమ్.

first episode promo out from bala krishna unstopable talk show on aha

తాజాగా ఈ  ప్రోగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో ను విడుదల చేశారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు మంచు, కుమార్తె లక్ష్మీ మంచు ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కి అతిథులుగా వచ్చారు. మంచు నందమూరి ఫ్యామిలీల మధ్య మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల్లో మోహన్ బాబు నటించగా … మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు.

Unstoppable Episode 1 Promo | Balakrishna | Mohan Babu, Vishnu, Lakshmi | Premieres Nov 4

ఈ ప్రోమోలో సినిమాలు, రాజకీయాలు ఇలా పలు అంశాలపై బాలకృష్ణ, మోహన్ బాబు మాట్లాడుకున్నారు.   హీరోగా నిలదొక్కుకునే క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుని మోహన్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణతో రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ బాధలో నిన్నొక విషయం అడుగుతా… తెలుగుదేశం స్థాపించినది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం ఆ పగ్గాలు మీరు చేతిలోకి తీసుకోకుండా… చంద్రబాబుకు ఎందుకిచ్చావ్ అని బాలకృష్ణను మోహన్ బాబు సూటిగా ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే నవంబర్ 4 వరకు ఆగక తప్పదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version