
Jr NTR, Sanjay Leela Bhansali: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంటేనే గొప్ప దర్శకుడు. సామాన్య హీరోలను కూడా అద్భుతంగా చూపించి.. వారి నుంచి ఎమోషనల్ నటనను రాబట్టుకోవడంలో భన్సాలీ తర్వాతే ఎవరైనా. అందుకే భన్సాలీ తో సినిమా చేయాలని చాలామంది స్టార్లు ఆశ పడుతూ ఉంటారు. కాకపోతే భన్సాలీ ఫలానా స్టార్ తోనే సినిమా చేయాలి వంటివి పెట్టుకోరు.
తన కథకు ఎవరు సూట్ అవుతారో వారితోనే సినిమా చేస్తారు. నిజానికి బాలీవుడ్ నెంబర్ వన్ హీరో షారుఖ్ ఖాన్ కూడా భన్సాలీతో సినిమా చేయాలని ఉంది అంటూ పబ్లిక్ గా చెప్పడంతో పాటు భన్సాలీని కూడా చాలాసార్లు ఓపెన్ గా అడిగారు. అయితే, భన్సాలీ మాత్రం కథ కుదరాలి అంటూ కథల పైనే కూర్చున్నారు. అలాంటి భన్సాలీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు.
ఇదే విషయం గురించి బాలీవుడ్ మీడియా అడిగితే.. భన్సాలీ చాలా క్లుప్తంగా ఆన్సర్ చెప్పాడు. ‘నిజానికి నేను తారక్ తో సినిమా చేయాలనే ఆలోచించక ముందే మీడియా మా కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ వార్తలను రాసింది. నేను ఎన్టీఆర్ నటనను చూశాను. మొదటిసారి నేను ఈ హీరోతో సినిమా చేయాలని ఫీల్ అయ్యాను. తారక్ నటన నాకు అంత బాగా నచ్చింది’ అంటూ భన్సాలీ చెప్పుకొచ్చాడు.
అయితే, భన్సాలీ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా విషయాన్ని మాత్రం ఖరారు చేయలేదు. అయితే, వీరి సినిమాకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. 14వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుందట. భన్సాలీ అంటేనే భారీ చారిత్రక నేపథ్యమున్న సినిమాలకు పెట్టింది పేరు.
మరి ఎన్టీఆర్ తో సినిమా అంటే.. భారీ అంచనాలు ఉంటాయి. ఇక భన్సాలీ రీసెంట్ గా ఎన్టీఆర్ తో కథ విషయం పై వీడియో కాల్ కూడా మాట్లాడాడని తెలుస్తోంది. ఎలాగూ తెలుగు హీరోలందరూ ప్యాన్ ఇండియా బాట పడుతున్నారు కాబట్టి.. ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.
Also Read: “ఆర్ఆర్ఆర్” అప్పుడు కూడా డౌటే !