OG movie Fire Storm song : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం నుండి రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ (Fire Storm) పాట యూత్ ఆడియన్స్ ని ఎలా ఉర్రూతలూ ఊగిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాటకు రోజుకి పది లక్షల వ్యూస్ వస్తున్నాయి. జియో సెవన్, స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ వంటి యాప్స్ లో కూడా ఈ పాట టాప్ లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. రోజుకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటి సెన్సేషన్ సృష్టించిన పాటకు సంబంధించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ పాట సినిమాలో ఉండదట. అవును మీరు వింటున్నది నిజమే. ‘పంజా’ సినిమా లాగా చేస్తారేమో అని భయం అక్కర్లేదు. అసలు విషయం మీ ముందు ఉంచబోతున్నాము.
ఈమధ్య కాలం లో సినిమాల్లో పాటలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఒకప్పుడు పాటని ఎంజాయ్ చేసే ప్రేక్షకుడు, ఇప్పుడు భారం గా చూస్తున్నాడు. అందుకే ఈమధ్య కాలం లో వస్తున్నా సినిమాల్లో పాటలు ఎక్కువ ఉండడం లేదు. ఇప్పుడు ఈ ఫైర్ స్ట్రోమ్ పాట సినిమాలో కేవలం ఒక థీమ్ మ్యూజిక్ గా వాడుతారట. అంటే ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ సినిమా మొత్తం వస్తూ ఉంటుందట. కచ్చితంగా చూసే ఆడియన్స్ కి ఇది అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి అనే అనుకోవచ్చు. కాబట్టి అభిమానులు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మూవీ టీం ఫ్యాన్స్ లో ఒక చిన్న అసంతృప్తి ఉంది. ఇంతటి అద్భుతమైన లిరికల్ వీడియో సాంగ్ ని ఇప్పటి వరకు హిందీ మరియు తమిళ వెర్షన్స్ లో విడుదల చెయ్యలేదు. ఇది అభిమానులకు తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తుంది.
తెలుగు లో విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాటని హిందీ మరియు తమిళ ఆడియన్స్ చూసి మెంటలెక్కిపోతున్నారు. ఇదేమి క్వాలిటీ బాబోయ్ అంటూ రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు. తమ భాషల్లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక సినిమాకు ఇతర భాషల్లో హైప్ లేదా క్రేజ్ క్రియేట్ అవ్వాలంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ తోనే క్రియేట్ చెయ్యగలం. అలాంటి క్వాలిటీ ని తమ వద్ద పెట్టుకొని కూడా సరిగా ప్రమోట్ చేయలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే విడుదల చేయలేదట, వారం కచ్చితంగా రిలీజ్ చేస్తారని టాక్. మరోపక్క ఈ సినిమాకు సంబంధించి ఒక బ్లాస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ ని ఆగష్టు 14 న విడుదల చేయబోతున్నారు. బహుశా ఇది టీజర్ అయ్యుండొచ్చని అంటున్నారు ఫ్యాన్స్.