నటీనటులు-సిబ్బంది:
నటీనటులు: విష్ణు విశాల్, గౌతమ్ మీనన్, రెబా మోనికా జాన్, మంజియీ మోహన్.
డైరెక్టర్ :మను ఆనంద్
నిర్మాత: శబ్రఆర్యన్ రమేశ్,
సంగీతం: రెబ మోనిక జాన్,
సినిమాటోగ్రఫీ: మంజిమ మోహన్,
ఎడిటింగ్: రయిజా మోహన్,
ప్రొడక్షన్ బ్యాన్: విని స్టూడియోస్.
FIR Movie Review: విష్ణు విశాల్ హీరోగా వచ్చిన మరో మూవీ ‘ఎఫ్ఐఆర్’. ఇప్పటికే ‘రాక్షసుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యంగ్ హీరోకు ఒక్క సినిమాతోనే సినీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తాజాగా ఆయన నటించిన ‘ఎఫ్ఐఆర్’మూవీని ప్రముఖ నటుడు రవితేజ మెచ్చుకోవడం చూస్తే విష్ణు విశాల్ పర్పామెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే శుక్రవారం విడుదలయిన ‘ఎఫ్ఐఆర్’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
ఇర్భాన్(విష్ణు విశాల్) ఇంజనీరింగ్ చదువు పూర్తిచేస్తాడు. ఆ తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఉద్యోగం దొరకదు. దీంతో పార్ట్ టైంగా ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. పోలీసులు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అబు బకర్ అబ్దుల్లా కోసం వెతుకుతుంటారు. ఇంటలిజెన్స్ విభాగం ఎంత ప్రయత్నించినా అతని జాడ దొరకదు. అయితే అబు బకర్ దేశ వ్యాప్తంగా బాంబ్ బ్లాస్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని తెలిసి ఇంటెలిజెన్స్ విభాగం అలెర్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఇర్ఫాన్ చేసిన కొన్ని తప్పుల వల్ల పోలీసులు అతనిని అనుమానిస్తారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుంటారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలేంటి..? అనేది సినిమా సారాంశం.
Also Read: డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
-విశ్లేషణ:
సాధారణంగా ముస్లిం యువకుడు అనగానే కొందరు పోలీసులు అనుమానిస్తారు. అదే కోణంలో సినిమా సాగుతుంది. అయితే ఓ అమాయకుడిపై పోలీసులు తీవ్రవాద ముద్ర వేస్తే అతని పరిస్థితి ఏంటనే విషయాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. సినిమా స్టోరీ సాదా సీదాగా సాగుతుంది. ఇర్భాన్ జీవితం, తన ఉద్యోగ ప్రయత్నాలు, అమ్మమీద ప్రేమ.. తనకో ఫ్లాష్ బ్యాక్ ఇలా ఇదివరకు వచ్చిన కథల్లాగే సినిమా సాగుతుంది. దాదాపు ఫస్టాఫ్ అంతా సినిమా స్లోగా మూవ్ కావడంతో కాస్త బోర్ అనిపిస్తుంది. అటు ఇంటలీజెన్స్ విభాగం ఇర్ఫాన్ పై చేసే ఒత్తిడి.. లింకులు పెట్టిన విషయాలే కనిపిస్తాయి. అయితే ఎయిర్ పోర్టులో ఇర్ఫాన్ ఫోన్ పోగొట్టుకున్నప్పటి నుంచి కథలో ఇంట్రెస్టు పెరుగుతుంది. అయితే ఫస్టాప్ సీన్లను డైరెక్టర్ జాగ్రత్తగా తీశాడు.
-ఎవరెలా చేశారంటే..?
నటుడు విష్ణు విశాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ పెద్దగా కనిపించదు. విష్ణు విశాల్ ఒక్కరే అయినా తనలో ఇద్దరిని చూస్తాం. అయితే అయన అలా కనిపించడానికి పెద్ద కారణమే ఉంటుంది. అదే సినిమాకు పెద్ద ట్విస్టు. గౌతమ్ మీనన్ తన ప్రతిభను చూపించాడు. కానీ వాయిస్ కనెక్ట్ కాకపోవడంతో పాత్ర అద్భుతంగా అనిపించదు. ఇక మంజుమా మోహన్ ది చిన్న పాత్రే. దీంతో ఆ పాత్రకు ప్రాధాన్యత పెరగలేదు.

– సాంకేతిక వర్గం ఎలా చేసిందంటే.?
కథ తనదే అయినా డైరెక్టర్ మను ఆనంద్ స్టోరీని పలు కోణాల్లో చూపించారు. ఇర్ఫాన్ సెంటిమెంట్, తన వ్యక్తిగత జీవితంతో పాటు ఎమోషన్ ను చూపించాడు. అయితే ఫస్టాఫ్ బోరుతో ఉన్నా ఆ తరువాత ట్విస్టుల పరంగా మంచి ఊపు తెప్పించాడు. కెమెరా పనితనం, సంగీతం ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ మరింత మెరుగుడాల్సి ఉండేది. ఫస్ట్ హాఫ్ లో హ్యాకర్ కి సంబంధించిన సన్నివేశాలు ట్రిమ్ చేయాల్సి ఉండేది. అయితే దీనిని వెబ్ సీరీసులో రిలీజ్ చేసినా అందుకు తగ్గన విషయం ఇందులో ఉంది. కానీ ఇంకాస్త దృష్టి పెడితే అద్భుతంగా వచ్చేది.
oktelugu.com రేటింగ్ 2.5/5
Also Read: వైట్ రైస్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ ప్రమాదకరమైన సమస్యలు!
[…] Also Read: ‘ఎఫ్ఐఆర్’ మూవీ రివ్యూ.. […]