https://oktelugu.com/

Film producer : అతడితో నా భార్య ఎఫైర్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత

కన్నడ నిర్మాత చంద్రశేఖర్ నమితను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె డ్రగ్స్ కు బానిసగా మారి అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆరోపించడం కొసమెరుపు.

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2023 / 09:03 PM IST
    Follow us on

    Film producer : తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఇందులో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సైతం ఇందులో భాగస్వాములయ్యారు. తరువాత కాలంలో మళ్లీ యథా పరిస్థితే. తాజాగా కబాలి నిర్మాత కేపీ చౌదరి ఇందులో పట్టుబడటంతో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.

    పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

    ఇందులో ఇంకా పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రముఖ నటి నమిత భర్త చంద్రశేఖర్ తన భార్య డ్రగ్స్ కు అలవాటు పడిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం. డ్రగ్స్ సరఫరా చేసే లక్షీత్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని చెప్పడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో అప్పుడు సంచలనంగా మారిన కేసు కొద్ది రోజులకు కామ్ గా మారిపోయింది.

    ఇంకా కొందరి పేర్లు

    ఈ కేసులో సురేఖ వాణి, జ్యోతి, అషురెడ్డి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై సురేఖ వాణి స్పందించింది. తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. కేపీ చౌదరితో కాంటాక్ట్ లో ఉన్న వారి జాబితా సిద్ధం చేశారని సమాచారం. అందులో భాగంగానే వీరి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ వ్యవహారం ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు.

    నా భర్తే నాపై దాడి చేయించాడు

    కన్నడ నిర్మాత చంద్రశేఖర్ నమితను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె డ్రగ్స్ కు బానిసగా మారి అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆరోపించడం కొసమెరుపు. ఇపుడు డ్రగ్స్ రాకెట్ ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు లాగుతుందోననే బెంగ అందరిలో పట్టుకుంది. దీనిపై నమిత మాత్రం తన భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వాపో యింది. లక్ష్మీశ్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెబుతోంది. తన భర్త చెప్పేవన్ని అబద్ధాలని కొట్టిపారేస్తోంది. తన భర్త స్నేహితులు అరుణ్, హేమంత్ తనపై దాడికి యత్నించారని చెప్పింది.