NTR- Nitin Narne: సినిమా వారసులకు హీరో అయిపోవాలని, అశేష అభిమానులను తెచ్చుకోవాలని.. ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయాలని ఆశ ఉంటుంది. కానీ రీల్ హీరోగా నిలబడాలి అంటే బోలెడు డబ్బు ఇండస్ట్రీలో గుమ్మరించాలి. లేదా, సినిమా రంగంలో బలమైన సపోర్ట్ అయినా ఉండాలి. ఏది ఏమైనా హీరో అనే పేరుతో పాటు హీరోగా క్లిక్ అయితే కోట్ల రూపాయల సంపాదన, పైగా సమాజంలో క్రేజ్, ఆ క్రేజ్ కి తగట్టు గౌరవం, అలాగే బోలెడంత గుర్తింపు వస్తోంది.
అన్నిటికి మించి చుట్టూ స్టార్ డమ్, అందుకే హీరో కావాలని జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, ఎన్టీఆర్ సతీమణి తమ్ముడు నితిన్ నార్నే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మధ్యలో ఓ దర్శకుడు కథను ఫైనల్ కూడా చేశారు. కాకపోతే అది మధ్యలోనే ఆగిపోయింది. కారణం మంచి కథ కోసం ఇన్నాళ్లు వెతికారు. బావగారి రేంజ్ ను చూసిన నితిన్ నార్నే, మొత్తానికి హీరో కాదు స్టార్ కావాలని ఆశ పడుతున్నాడు.
Also Read: Sivatmika: శివాత్మిక లిస్ట్ పెరిగింది.. రాజశేఖర్ కి ఇక పుత్రికోత్సాహమే ఆలస్యం !
సరే బావ స్టార్ డమ్ పక్కన పెడితే.. నార్నే ఎస్టేట్స్ నార్నే శ్రీనివాసరావు కుమారుడు నితిన్ నార్నే. అవసరం అయితే, ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా కూడా హీరో కాగలిగే సపోర్ట్ ఉన్నోడు. కాకపోతే ఎన్టీఆర్ కి స్వంత బావమరిది కాబట్టి, ఎన్టీఆర్ కథ దగ్గర నుంచి మిగిలిన వ్యవహారాల వరకు అన్నీ చూసుకుంటున్నాడు. కాగా నితిన్ నార్నే హీరోగా ఒక కథ ఫైనల్ అయింది.
రచయిత వక్కంతం వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్ కి నచ్చింది. ఇప్పటికే నితిన్ యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు. యాక్టింగ్ గురు సత్యానంద్ దగ్గర ప్రస్తుతం నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. కాబట్టి త్వరలోనే నితిన్ నార్నే హీరోగా సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి అని ఇప్పటికైతే వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా ? మొత్తానికి ఎన్టీఆర్ బావమరిది కూడా హీరోగా లాంచ్ అవుతున్నాడు అన్నమాట. అక్టోబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కానుంది.
Also Read:Bimbisara History: ఎవరీ బింబిసారుడు.. అతడి విజయ రహస్యం ఏంటి?