https://oktelugu.com/

FEFSI: తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ వద్దంటూ వివాదం రాజేసిన మంత్రి రోజా భర్త… ఆయనకొచ్చిన చిక్కేంటీ!

తమిళ చిత్రాల షూటింగ్స్ తమిళనాడులోనే చేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(FEFSI) తీర్మానం చేశారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే తమ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని అసోసియేషన్ తేల్చి చెప్పింది. అంతే కాకుండా షూటింగ్ల కోసం తమిళ సినీ కార్మికులనే తీసుకోవాలని పెప్సీ నిర్ణయించింది.

Written By:
  • Shiva
  • , Updated On : July 22, 2023 / 02:03 PM IST

    FEFSI

    Follow us on

    FEFSI: ఒకప్పుడు చెన్నై సౌత్ ఇండియా సినిమా హబ్ గా ఉండేది. ఇప్పటికి కూడా కొన్ని అవసరాల కోసం చెన్నై వెళ్ళాల్సిందే. పరిస్థితులు మారుతూ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్స్ కి అనువైన ప్రాంతాలుగా మారాయి. బాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక బెస్ట్ నేచురల్ లొకేషన్స్ కోసమైతే ఏపీని ఆశ్రయిస్తున్నారు. చాలా కాలంగా అరకు, వైజాగ్, కోనసీమ షూటింగ్స్ కి నెలవుగా మారింది.

    భారీ చిత్రాలు కూడా ఏపీ, తెలంగాణాలలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.తమిళ పరిశ్రమకు చెందిన భారతీయుడు 2, విజయ్ లియో షూటింగ్స్ ఏపీలో జరిగాయి. శంకర్ దర్శకుడిగా ఉన్న గేమ్ ఛేంజర్ షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిపారు. తమిళ చిత్రాల షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో జరపడాన్ని మంత్రి రోజా భర్త సెల్వమణి తప్పుబడుతున్నారు. కోలీవుడ్ దర్శక నిర్మాత అయిన సెల్వమణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    తమిళ చిత్రాల షూటింగ్స్ తమిళనాడులోనే చేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(FEFSI) తీర్మానం చేశారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే తమ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని అసోసియేషన్ తేల్చి చెప్పింది. అంతే కాకుండా షూటింగ్ల కోసం తమిళ సినీ కార్మికులనే తీసుకోవాలని పెప్సీ నిర్ణయించింది.

    ఏపీ,తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఉద్యమం లేవదీశారు. తమిళ సినీ కార్మికులకు పనులు ఉండటం లేదని, అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని సెల్వా అంటున్నారు. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించారని, తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు. పెప్సీ పేరున ఓ సినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?.. అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

    ఏపీలో రోజా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. భర్త సెల్వమణి ఏపీలో షూటింగ్స్ చేయకూడని పోరాటం చేస్తున్నారు. భార్య శాఖకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేస్తున్నట్లుగా ఉంది. ఇక సెల్వమణి తీరుపై పలువురు మండిపడుతున్నారు. సినిమా కథ ఆధారంగా దర్శకులు లొకేషన్స్ ఎంచుకుంటారు. అక్కడ పరిమితులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.