https://oktelugu.com/

Bro Movie Advance Bookings: ‘లండన్’ లో ‘బ్రో ది అవతార్’ ప్రభంజనం..అడ్వాన్స్ బుకింగ్స్ తోనే #RRR అవుట్..?

అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి లండన్ లో మాత్రం అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి ఈ ప్రాంతం లో నాలుగు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. వీటి నుండి సుమారుగా 30 వేల డాలర్లు వచ్చాయని టాక్. 'ఆదిపురుష్' చిత్రానికి ప్రీమియర్ షోస్ కి ఈ ప్రాంతం లో 7 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. 'బ్రో ది అవతార్' చిత్రం విడుదలకు ఇంకా ఆరు రోజుల సమయం ఉంది.

Written By: , Updated On : July 22, 2023 / 01:56 PM IST
Bro Movie Advance Bookings

Bro Movie Advance Bookings

Follow us on

Bro Movie Advance Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో ఆరు రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకి సంబంధియించిన ట్రైలర్ ని సాయంత్రం ఆరు గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్ మీదనే అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఆధారపడి ఉంది.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, బాగానే ఉన్నాయి కానీ పవర్ స్టార్ రేంజ్ లో లేవు. ఒక్కసారి ట్రైలర్ వస్తే అన్నీ సమీకరణాలు మారుతాయని, కచ్చితంగా ఈ చిత్రం అమెరికా నుండి 1 మిలియన్ డాలర్స్ వసూళ్లను ప్రీమియర్స్ లో రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఇది ఎంత మాత్రం నిజం అవుతుందో అనేది.

అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి లండన్ లో మాత్రం అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి ఈ ప్రాంతం లో నాలుగు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. వీటి నుండి సుమారుగా 30 వేల డాలర్లు వచ్చాయని టాక్. ‘ఆదిపురుష్’ చిత్రానికి ప్రీమియర్ షోస్ కి ఈ ప్రాంతం లో 7 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదలకు ఇంకా ఆరు రోజుల సమయం ఉంది.

టికెట్స్ ఓపెన్ అవ్వాల్సిన థియేటర్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ప్రీమియర్స్ కి ఒక రోజు ముందే ఈ చిత్రానికి 10 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అలాగే కన్నడలో కూడా ఈ చిత్రం ఇప్పటికే 10 వేలకు పైగా డాలర్స్ వసూలు అయ్యాయి. ఈ టికెట్స్ అన్నీ అమ్ముడుపోవాలంటే కచ్చితం గా ట్రైలర్ అద్భుతంగా ఉండాలి.