ఫిబ్ర‌వ‌రి రివ్యూః వెండితెర వెలిగిందా..?

సినీ ప‌రిశ్ర‌మ‌కు క‌రోనా భ‌యం పూర్తిగా తొల‌గిపోయిన‌ట్టే. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న‌ప్పుడే ప‌లు సినిమాలు థియేట‌ర్లో సంద‌డి చేశాయి. ఇక‌, ఇప్పుడు 100శాతం సీటింగ్ కు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది. దీంతో.. మ‌ళ్లీ పాత‌రోజులు వ‌చ్చేసిన‌ట్టే. జ‌నాలు కూడా పూర్తిస్థాయిలో థియేటర్ల‌కు వ‌చ్చేస్తున్నారు. సినిమాలో స‌త్తా ఉంటే.. చిన్నాపెద్దా తేడాలేకుండా హౌస్ ఫుల్ అయిపోతుంద‌ని మ‌ళ్లీ తేలిపోయింది. Also Read: ‘మడ్డీ’ టీజర్ టాక్: బురదరోడ్డులో ఫైట్ ఉత్కంఠభరితం జ‌న‌వ‌రి త‌ర్వాత రిలీజుల్లో వేగం పెరిగింది. […]

Written By: Bhaskar, Updated On : February 27, 2021 11:15 am
Follow us on


సినీ ప‌రిశ్ర‌మ‌కు క‌రోనా భ‌యం పూర్తిగా తొల‌గిపోయిన‌ట్టే. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న‌ప్పుడే ప‌లు సినిమాలు థియేట‌ర్లో సంద‌డి చేశాయి. ఇక‌, ఇప్పుడు 100శాతం సీటింగ్ కు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది. దీంతో.. మ‌ళ్లీ పాత‌రోజులు వ‌చ్చేసిన‌ట్టే. జ‌నాలు కూడా పూర్తిస్థాయిలో థియేటర్ల‌కు వ‌చ్చేస్తున్నారు. సినిమాలో స‌త్తా ఉంటే.. చిన్నాపెద్దా తేడాలేకుండా హౌస్ ఫుల్ అయిపోతుంద‌ని మ‌ళ్లీ తేలిపోయింది.

Also Read: ‘మడ్డీ’ టీజర్ టాక్: బురదరోడ్డులో ఫైట్ ఉత్కంఠభరితం

జ‌న‌వ‌రి త‌ర్వాత రిలీజుల్లో వేగం పెరిగింది. ఫిబ్ర‌వ‌రిలో వారానికి క‌నీసం మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీసు దండ‌యాత్ర‌కు సిద్ద‌మ‌య్యాయి. కానీ.. ఈ నెల‌లో ‘ఉప్పెన’ మాత్ర‌మే బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా వ‌సూళ్ల సునామీ సృష్టించింది. దాదాపు ఫిబ్ర‌వ‌రి నెల మొత్తం ఈ సినిమా హ‌వా కొన‌సాగిందని చెప్పొచ్చు. ఇక‌, ఇదే నెల‌లో విడుద‌లైన అల్లరి నరేష్ ‘నాంది’ మంచి టాక్ తెచ్చుకుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు ఉప్పెన సుమారు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో అల్లరి నరేష్ ‘నాంది’కూడా మంచి కలెక్షన్లు సాధించింది. నిర్మాత‌ల‌కు భారీ లాభాలు రాకపోయినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ సాధించి, మంచి కలెక్షన్లే రాబట్టింది. ఇక, రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాత‌ల‌కు మంచి అమౌంట్ వచ్చిందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఏ రూపంలో డబ్బులు వచ్చినా.. లాభం కింద లెక్క కాబట్టి.. నాంది మంచి లాభాలనే సాధించిందని చెప్పొచ్చు. ఈ విధంగా ఫిబ్రవరిలో రెండు సినిమాలు హిట్లుగా నిలిచాయి.

Also Read: వ్యవసాయం పెద్ద విషయం అవుతుంది: త్రివిక్రమ్

ఇక, ఫిబ్రవరిలోనే విడుద‌లైన ‘జాంబీరెడ్డి’ మిక్స్ డ్ టాక్ తో ఫర్వాలేదనిపించుకుంది. ఇక, మిగిలిన సినిమాలన్నీ టపా కట్టేశాయి. సత్తా చాటుతుందనుకున్న నితిన్ ‘చెక్’మూవీపై నెగెటివ్ కామెంట్లే వస్తున్నాయి. జ‌గ‌ప‌తి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన FCUK ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది.

వీటితోపాటు వచ్చిన క‌ప‌ట‌ధారి, పొగ‌రు, అక్ష‌ర‌, మ‌ధుర వైన్స్‌, జీ ఫ‌ర్ జాంబీ, ప్ర‌ణ‌వం వంటి సినిమాలన్నీ.. ఎప్పుడు వచ్చిపోయాయో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇక, రాబోతున్న మార్చిలోనూ థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ప్ర‌తీ వారం మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో పెద్ద సనిమాలు కూడా ఉన్నాయి. మరి, ఏవి సత్తా చాటుతాయి? ఏవి డిజాస్ట‌ర్ గా మిగిలిపోతాయి? అన్న‌ది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్