Mahesh Babu: ఓ సూపర్ స్టార్ కడుపున పుట్టి సూపర్ స్టార్ గా ఎదగడం అంత ఈజీ కాదు. పైగా అలా పుట్టిన వారసుడు తన ప్రమేయం లేకుండానే ఫ్యాన్స్ ఆశలు, ఆశయాలు భుజాలపై మోయాల్సి ఉంటుంది. హీరోగా చరిత్ర సృష్టించిన వ్యక్తి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ అంచనాలు అందుకోలేకపోతే, అంతకన్నా అవమానం ఉండదు. తెలుగు చిత్ర పరిశ్రమను పరిశీలిస్తే వారసులుగా పరిశ్రమకు పరిచయమై స్టార్స్ అయినవాళ్లు పదుల సంఖ్యలో ఉంటే… విఫలమైన వాళ్ళు వందకు పైగా ఉన్నారు.
స్టార్ కొడుకుగా పుట్టడం వలన లాంచింగ్ చాలా ఈజీగా జరుగుతుంది. అలా అని కెరీర్ మొత్తం మోసేవారు ఉండరు. అతడిలో సత్తా, టాలెంట్, ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే స్టార్ అవుతాడు. లేదంటే రెండు మూడు సినిమాలకే పెట్టేబేడా సర్దుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మహేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని ఆయన కొనసాగిస్తూ స్టార్ హీరో హోదా దక్కించుకున్నారు.
అయితే కృష్ణ లాంటి కొండంత అండ ఉండి కూడా మహేష్ హీరోగా మారడానికి బయపడ్డారట. అభిమానుల అంచనాలు అందుకోగలనా అనే భయాన్ని ఎదుర్కొన్నారట. ఒక లెజెండరీ హీరో కొడుకుగా తన మార్కు వెండితెరపై ఎలా క్రియేట్ చేయాలనే ఆలోచనలు మహేష్ ని కుదిపివేశాయట. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన మహేష్ ని కూడా ఆందోళన వెంటాడిందట.
చదువు పూర్తి కాగానే కృష్ణ సినిమాలకు సిద్ధమవమని ఆదేశించారట. టీనేజ్ వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన మహేష్ కూడా ఆ సమయంలో బయపడ్డారట. నాన్న స్థాయి హీరోని నేను కాగలనా? ఆయన అభిమానుల అంచనాలు నేను అందుకోగలనా? అదే సమయంలో నాకంటూ ఓ ప్రత్యేకమైన శైలి క్రియేట్ చేయడం ఎలా? ఇలా పలు ఆలోచనలు మహేష్ బుర్రను తొలిచేశాయట.
Also Read: Kalyan ram: “బాలయ్య బాలయ్య… ఇరగతీసావయ్యా అంటున్న కళ్యాణ్ రామ్…
ఇన్ని సందేహాలు, భయాలతో మహేష్ ఎంట్రీ జరిగిందట. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ ఈ విషయాలు వెల్లడించారు. 1999లో విడుదలైన రాజకుమారుడు హీరోగా మహేష్ కి మొదటి చిత్రం. కె రాఘవేంద్రరావు మహేష్ లాంచింగ్ బాధ్యత తీసుకున్నారు. కృష్ణ నమ్మకాన్ని వమ్ము చేయని రాఘవేంద్రరావు సూపర్ హిట్ ఇచ్చారు. మహేష్ కి జంటగా ప్రీతీ జింటా నటించిన ఈ మూవీలో కృష్ణ క్యామియో రోల్ చేశారు. రాజకుమారుడు మ్యూజికల్ హిట్ గా నిలిచింది. మణిశర్మ పాటలు యూత్ ని ఊపేశాయి.
Also Read: Chatrapathi: భీమిలీ బీచ్లో ఛత్రపతి సందడి