పీసీసీ రేస్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్ల పాట్లు

కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు చూసినా ఒకరంటే ఒకరికి పొసగదు. నిత్యం గ్రూపుల కుమ్ములాటలు బహిర్గతం అవుతూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా సీనియర్లు వర్సెస్‌ జూనియర్లు అంటూ అలకలు కనిపిస్తుంటాయి. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ ఎందుకో తెలుసా.. ఈ ఎన్నికల్లో సత్తా చాటితే కేంద్రం దృష్టి తమ మీద పడుతుందని. రాష్ట్ర కాంగ్రెస్‌లో […]

Written By: NARESH, Updated On : October 31, 2020 5:32 pm
Follow us on

కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు చూసినా ఒకరంటే ఒకరికి పొసగదు. నిత్యం గ్రూపుల కుమ్ములాటలు బహిర్గతం అవుతూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా సీనియర్లు వర్సెస్‌ జూనియర్లు అంటూ అలకలు కనిపిస్తుంటాయి. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఎందుకో తెలుసా.. ఈ ఎన్నికల్లో సత్తా చాటితే కేంద్రం దృష్టి తమ మీద పడుతుందని. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం సీనియర్ల అంతా కలిసి పనిచేయకున్నా.. ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. అగ్రనేతలంతా ఒక్కో మండలాన్ని డీల్‌ చేస్తున్నారు. దీంతో వారంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

Also Read: బెడిసి కొడుతున్న కేసీఆర్ ప్లాన్.. వరద సాయం టీఆర్ఎస్ ను ముంచనుందా?

ఇదంతా చూస్తుంటే భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే వారు ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్‌ రేస్‌ నడుస్తోంది. ఈ రేసులో నెగ్గాలంటే కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిగం ఠాకూర్‌‌ను మెప్పించాలి. ఆయనను పొగడ్తలతో మెప్పించలేకపోతున్నారు. అందుకే పనితీరుతోనే నమ్ముకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ సీనియర్లు ఇప్పుడు దుబ్బాకలో చెమటోడుస్తున్నారు.

గతంలో ఏ ఉప ఎన్నికను కూడా కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు ఫోకస్‌ అంతా దుబ్బాక ఉప ఎన్నిక మీదనే పెట్టింది. అంతేకాదు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఇటీవల నియమితులైన మాణిగం ఠాకూర్‌‌ కూడా అక్కడి ప్రచారంలో పాల్గొంటున్నాడు. రేవంత్ రెడ్డికి మిర్దొడ్డి మండల బాధ్యతలు అప్పగించారు. ఆ మండలం టీఆర్ఎస్‌కు కంచుకోట లాంటిది. అయినప్పటికీ.. రేవంత్ నిరాశపడలేదు. తన టీమ్‌ను తెప్పించుకుని వ్యూహాలు పన్నుతున్నారు. శరవేగంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కన్నా ఒక్క ఓటు అయినా మెజార్టీ తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అభ్యర్థిని తన చాయిస్‌గా ఎంపిక చేసి టిక్కెట్ ఇప్పించుకున్న డిప్యూటీ మాజీ సీఎం దామోదర రాజనర్సింహ తొగుట మండల బాధ్యత తీసుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దొల్తాబాద్ మండలంలో ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ కంటే 100 ఓట్లు ఎక్కువే తెస్తా అని శపథం చేశారు.

Also Read: స్కూళ్ల ప్రారంభం: విద్యార్థులకు కరోనా భయం?

ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దుబ్బాక మండల బాధ్యతలు చూస్తున్నారు. ఈ నలుగురికీ ఇప్పుడు వారిలో వారికే పోటీ నెలకొంది. ఎవరికి వారు తమ మండలంలో మెజార్టీ సాధించి పీసీసీ రేసులో ముందుండాలని చూస్తున్నారు. మరి ఈ ఎన్నికలో ఎవరు మెజార్టీ సాధిస్తారు.. ఎవరి ఎత్తులు ఏ మేరకు పనిచేస్తాయి..? ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.