Maharashtra: ఫోన్.. ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారింది. అనేక రూపాంతరాల తర్వాత ఆన్‌డ్రాయిడ్ ఫోన్ ఇప్పుడ మన చేతుల్లో ఉంది. ఈఫోన్‌తో ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చేంది. ఏ సమచారం కావాలన్నా క్షణాల్లో ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. వినోదం పొందవచ్చు. సినిమాలూ చూడవచ్చు. ఇక సోషల్ మీడియా యాప్‌లు అయితే అనేకం ఉన్నాయి. అయితే ఈ ఫోన్లతో ఎంత ఉపయోగం ఉందో.. అంతే అనర్థాలు ఉన్నాయి. ఫోన్లలోని కొన్ని ఆప్షన్లు మహిళలు, పిల్లకు శాపంగా మారుతున్నాయి. సంసారాలను కూల్చేస్తున్నాయి. ప్రేమికులను విడదీస్తున్నాయి. ఇక యువత పోర్న్ సైట్స్ చూస్తూ పెడదారి పడుతున్నారు. తాజాగా 14 ఏళ్ల కొడుకు ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని అతనికి విషం ఇచ్చి చంపేశాడు ఓ తండ్రి.
మహారాష్ట్రలో ఘటన..
మహారాష్ట్రలోని శోలాపూర్ జిల్లాకు చెందిన విజయ్ టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కొడుకు విశాల్‌ను సమీపంలోని పాఠశాలలో చదివిస్తున్నాడు. రోజూ స్కూల్‌కు ఫోన్ తీసుకెళ్తున్న విశాల్ అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. దీనిపై ఉపాధ్యాయులు పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ఇవ్వొద్దని సూచించారు. అయినా విశాల్ రహస్యంగా ఫోన్ తీసుకెళ్లేవాడు. తన చెడిపోవడమే కాకుండా తోటి విద్యార్థులను కూడా చెడగొడుతుండడంతో విశాల్ తండ్రి విజయ్‌ను పిలిపించి మందలించారు.
ఆహారంలో విషం కలిపి..
కొడుకు తీరుతో విసిగిపోయిన తండ్రి ఇటీవల ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు. ఈ విషయం తన భార్యకు కూడా తెలియనివ్వలేదు. విశాల్ చనిపోయాక మృతదేహాన్ని తీసుకెళ్లి మురికి కాలువలో పడేశాడు. తన కడుకు కనిపిచండం లేదని జనవరి 13న విజయ్, అతని భార్య సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. తమకు లభించిన ఆధారాలతో తండ్రి చెప్పిన వివరాలను పోల్చి చూశారు. పోలీసులకు అనుమానం రావడంతో చివరకు విజయ్ జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Father who poisoned his son who was watching bad videos