Ram Charan- Shankar Movie: ఇండియన్ క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించి దేశం గర్వించే స్థాయిలో నిలిచినా యువరాజ్ సింగ్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేసి మూడేళ్లు అయ్యింది..ప్రస్తుతం ఆయన వృత్తి ఏమి చేస్తున్నాడు అనేది క్లారిటీ ఎవరికీ లేకపోయినా, అతని తండ్రి యోగరాజ్ సింగ్ మాత్రం బాలీవుడ్ లో పెద్ద స్టార్ నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు..అంతే కాదు ఆయన కూడా వన్ మరియు టెస్ట్ క్రికెట్ ప్లేయర్ అనే సంగతి కూడా కొంతమందికి తెలియదు.

ఇప్పటి వరుకు ఈయన సుమారుగా 50 కి పైగా సినిమాల్లో నటించాడు కానీ సౌత్ లో ఇంతవరుకు ఆయన ఒక్క సినిమాలో కూడా నటించలేదు..కానీ ఇప్పుడు ఆయన ఏకంగా సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలోనే నటించే ఛాన్స్ ని కొట్టేసాడు..డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2 ‘ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా సాగుతుంది.
భారీ కాస్టింగ్ మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పుడు యోగరాజ్ సింగ్ కూడా భాగం అయ్యాడు..ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు..’శంకర్ సార్ ఇండియన్ 2 లో నటిస్తున్నాను..తెరవెనుక పని చేసే మేకప్ మ్యాన్స్ కి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను..నన్ను చాలా అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు..ఇండియన్ 2 లో నటించడానికి ఈ పంజాబీ సింహం సిద్ధం అవుతుంది’ అంటూ ఒక పోస్టు వేసాడు..అది ఇప్పుడు వైరల్ గా మారింది.

కేవలం ఇండియన్ 2 లో మాత్రమే కాదు..శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం లో కూడా యోగరాజ్ సింగ్ ఒక పవర్ ఫుల్ పాత్రని పోషించబోతున్నట్టు తెలుస్తుంది..అలా వరుసగా క్రేజీ ఆఫర్స్ తో యోగరాజ్ సింగ్ సౌత్ లో బాగా బిజీ అవ్వబోతున్నాడు.