Godfather OTT: ఆచార్య ఫెయిల్యూర్ కి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ తో సమాధానం చెప్పారు. పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది.వెండితెరపై చిరు ప్రెజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇలా కదా బాస్ ని మేము చూడాలనుకుంటుందని కాలర్ ఎగరేశారు. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్ వసూళ్ళలో కూడా అదే జోరు చూపించింది. చిరంజీవి కెరీర్ లో మరో మాస్ హిట్ గా గాడ్ ఫాదర్ నిలిచింది.

మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కించారు. అయితే చిరంజీవి ఇమేజ్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్లు సమూల మార్పులు చేశారు. ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్ర కేవలం 45 నుండి 60 నిమిషాల మాత్రమే ఉంటుంది. గాడ్ ఫాదర్ లో దాన్ని పూర్తి నిడివికి మార్చారు. అలాగే ఒరిజినల్ లో లేని పది పాత్రలు కొత్తగా జోడించారు. ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్ మూవీగా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. దర్శకుడు మోహన్ రాజా చిరంజీవిని ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులకు నచ్చింది.చిరంజీవి యాక్షన్ , మేనరిజం, మాస్ డైలాగ్స్ అదిరాయి.
నయనతార, సత్యదేవ్ కీలక రోల్స్ చేశారు. థమన్ మ్యూజిక్ అందించారు. థియేటర్స్ లో దుమ్ముదులిపిన ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధం అవుతుంది. నవంబర్ 19 నుండి గాడ్ ఫాదర్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. దీనిపై నేడు అధికారిక ప్రకటన చేశారు. దీంతో బుల్లితెరపై ఇంట్లో కూర్చుని గాడ్ ఫాదర్ ఎంజాయ్ చేసే అవకాశం అభిమానులకు కలగనుంది. ఈ అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ కీలమైన క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.

ఇక వరుస చిత్రాలు చేయడంలో యంగ్ హీరోలు కూడా చిరు దెబ్బకు చాలడం లేదు. ఆచార్య విడుదలైన ఆరు నెలల్లో గాడ్ ఫాదర్ మూవీతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. మరో మూడు నెలల్లో వాల్తేరు వీరయ్య అంటూ సందడి చేయనున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పిచ్చ లేపింది. ఈ చిత్రంలో రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.