spot_img
Homeఎంటర్టైన్మెంట్Faria Abdullah: అందాల గేట్లు ఎత్తిన చిట్టి.. కుర్రకారు గుండెల్లో మంటలే

Faria Abdullah: అందాల గేట్లు ఎత్తిన చిట్టి.. కుర్రకారు గుండెల్లో మంటలే

Faria Abdullah: కొప్పు బాగుండాలే కానీ జుట్టు ఎలాగైనా వేసుకోవచ్చు. అలాగే ఎత్తు, దానికి తగ్గట్టు రంగు, శరీర సౌష్టవం ఉండాలి కానీ కుర్రకారు గుండెల్లో సెగలు రేపొచ్చు. ప్రస్తుతం చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా అలానే చేస్తోంది. జాతి రత్నాలు సినిమా తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తుండడంతో ఊపిరి సలపకుండా సినిమాలు చేస్తోంది. తాజాగా ఫరియా అబ్దుల్లా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇన్నాళ్లు సంప్రదాయమైన దుస్తుల్లో కనిపించిన ఫరియా.. సైమా అవార్డుల వేడుక నుంచి అందాల గేట్లు ఒక్కసారిగా ఎత్తింది.

Faria Abdullah
Faria Abdullah

అంతకుమించి

జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరియా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. కొంచెం గ్యాప్ తర్వాత నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు సినిమాలో టైటిల్ సాంగ్ లో ఆడి పాడింది. నాగ చైతన్యకు, నాగార్జునకు దీటుగా స్టెప్పులు వేసి అలరించింది. ఈమె ఒడ్డు, పొడవు చూసి మేర్లపాక గాంధీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో ఆలీ నిర్వహించిన ఓ టాక్ షో లో ఫరియా, సినిమా హీరో సంతోష్ శోభన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు చిట్టి ఏమాత్రం తడవకుండా సమాధానం చెప్పింది. బెల్లీ డాన్స్ లో చిత్ర విచిత్రమైన స్టెప్పులు వేసి ఆలికి చుక్కలు చూపించింది.

ఎందుకు ఈ హాట్ నెస్

ఫరియా ను చూస్తే మన ఇంటి పక్కింటి అమ్మాయిల గా కనిపిస్తుంది. జాతి రత్నాలు సినిమాలోనూ అనుదీప్ ఆమె పాత్రను అదే విధంగా మలిచాడు. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను సరిగా వద్దు అనుకుంది. సరైన కథాబలం లేకపోవడమే ఇందుకు కారణమని ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ మధ్య బెంగళూరులో నిర్వహించిన సైమా అవార్డు ఫంక్షన్లో ఈషా రెబ్బ తో కలిసి చిందులు వేసింది. ఆ తర్వాత మేర్లపాక గాంధీ సినిమాకు ఓకే చెప్పింది.

Faria Abdullah
Faria Abdullah

ఈ సినిమాలో ఆమె అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా కనిపించనుంది. తర్వాత రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర సినిమాలోనూ ఫరియా నటిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తాను నిర్వహించిన ఫోటోషూట్ ఫరియా లోని కొత్త యాంగిల్ ను యూత్ కు పరిచయం చేసింది. మత్తెక్కించే తన కళ్ళకు ఫ్లాష్ వేయడంతో మరింత కైపు ఎక్కిస్తున్నాయి. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కాస్ట్యూమ్.. ఆమెను దేవకన్య లాగా మార్చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోవాలి కానీ ఫరియా అందం వర్ణనకు అందదు. తెలుగు చిత్ర పరిశ్రమను ఏలే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటున్న ఫరియా.. మునుముందు ఎటువంటి సంచలనాలకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version