https://oktelugu.com/

Faria Abdullah: చీకటి గదిలో చిలిపి పనులు… జాతి రత్నాలు బ్యూటీ దాచుకోకుండా చూపించేస్తుందే!

జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ఫరియా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యారు. జాతి రత్నాలు అనంతరం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో చిన్న వ్యాంప్ రోల్ చేసింది.

Written By: , Updated On : May 17, 2023 / 10:49 AM IST
Faria Abdullah

Faria Abdullah

Follow us on

Faria Abdullah: ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఫరియా అబ్దుల్లా. 2021లో విడుదలైన జాతి రత్నాలు సెన్సేషన్ కాగా ఆ కామెడీ ఎంటర్టైనర్ లో ఫరియా హీరోయిన్ గా నటించింది. ఈ హైదరాబాద్ బ్యూటీకి ఇదే మొదటి చిత్రం. దర్శకుడు అనుదీప్ నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు. ఫరియా చిట్టి పాత్రలో ఆకట్టుకుంది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. చిట్టి పాత్రలో ఫరియా సహజంగా నటించి మెప్పించారు.

జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ఫరియా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యారు. జాతి రత్నాలు అనంతరం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో చిన్న వ్యాంప్ రోల్ చేసింది. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ఆ మూవీలో ఫరియా పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత ఉండదు. 2022 సంక్రాంతి విన్నర్ బంగార్రాజు మూవీలో ఫరియా ఐటెం సాంగ్ చేశారు.

సోలో హీరోయిన్ గా ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ మూవీ చేశారు. హీరో సంతోష్ శోభన్ కి జంటగా ఫరియా నటించారు. ఇది చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. ఫరియా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో రవితేజ మూవీ రావణాసుర పై అమ్మడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర నిరాశపరిచింది. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఫరియా అబ్దులా కెరీర్ నిరాశాజనకంగా సాగుతుంది.

సోషల్ మీడియాలో మాత్రం ఫరియా ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఫరియా మంచి డాన్సర్. తన టాలెంట్ చూపిస్తూ వీడియోలు చేస్తుంది. అవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. అలాగే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. తాజాగా ఫరియా బోల్డ్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేశారు. చీకటి గదిలో పరువాలు దాస్తూ చూపిస్తూ కవ్వించారు. లావాలా కరిగిపోతున్నానని ఆ ఫోటోలకు కామెంట్ జోడించారు. ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.