https://oktelugu.com/

Sudigali Sudheer: ఆ ఒక్క విషయం చెప్పమంటూ సుడిగాలి సుధీర్ ని రిక్వస్ట్ చేస్తున్న ఫ్యాన్స్… ఏంటంటే ?

Sudigali Sudheer: జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లు, టెక్నిషియన్లకు లైఫ్ ఇచ్చింది. అంతే స్థాయిలో జనాలకు ఎంటైర్‌టైన్మెంట్‌ కూడా అందిస్తోంది. అయితే ఈ షో ద్వారా సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తుల్లో సుడిగాలి సుధీర్ ముందు వరసలో ఉంటారు. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది. కేవలం కమెడియన్‌గానే కాకుండా హోస్ట్‌గా కూడా సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా చేస్తున్నా కూడా జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు సుధీర్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 05:43 PM IST
    Follow us on

    Sudigali Sudheer: జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లు, టెక్నిషియన్లకు లైఫ్ ఇచ్చింది. అంతే స్థాయిలో జనాలకు ఎంటైర్‌టైన్మెంట్‌ కూడా అందిస్తోంది. అయితే ఈ షో ద్వారా సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తుల్లో సుడిగాలి సుధీర్ ముందు వరసలో ఉంటారు. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది. కేవలం కమెడియన్‌గానే కాకుండా హోస్ట్‌గా కూడా సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా చేస్తున్నా కూడా జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు సుధీర్‌ గురించి ఒక ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకులను ముఖ్యంగా ఆయన అభిమానులను వేదిస్తుంది.

    గత కొన్నాళ్లుగా ఢీ ను సూపర్‌ హిట్‌ చేసిన సుధీర్‌ ఈ సీజన్ లో కనిపించడం లేదు. సుడిగాలి సుధీర్ లేకుంటే రష్మి ఉన్నా కూడా వృధా అని అందరికి తెలిసిందే. ఆ విషయం పక్కన పెట్టేస్తే… సుడిగాలి సుధీర్ ను ఢీ నుండి తొలగించారా లేదా సుధీర్‌ స్వయంగా తప్పుకున్నాడా అనేది అభిమానుల అనుమానం. ఈ ప్రశ్నకు సమాధానం మల్లెమాల వారు లేదా సుధీర్‌ చెప్పాలి. వీరిద్దరిలో ఏ ఒక్కరు ఈ విషయంను చెప్పడం లేదు. ఇటీవల జబర్దస్త్‌ కామెడీ స్కిట్‌ లో సుధీర్ మాట్లాడుతూ ఇంకా ఏం మానేయాలిరా ఇప్పటికే ఢీ మానేశాను అన్నాడు.

    ఆయన మాటలను బట్టి ఢీ ఆయనే మానేశాడనే అభిప్రాయంకు కొందరు వచ్చారు. కాని మల్లె మాల వారు బడ్జెట్‌ కంట్రోల్‌ కోసం ఆయన్ను తొలగించారనే ప్రచారం కూడా జరుగుతుంది. సోషల్‌ మీడియాలో సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్‌ కామెడీ ని ఎంతగా జనాలు ఎంజాయ్‌ చేస్తారో ఎవరైనా సుధీర్‌ ను అవమానిస్తే అంతే ధీటుగా ప్రతిస్పందిస్తారు. అందుకే సుధీర్‌ ను కనుక మల్లెమాల వారు ఢీ నుండి తొలగించినట్లుగా తేలితే ఖచ్చితంగా అభిమానులు వీరంగం సృష్టిస్తారేమో. దీంతో సుధీర్ ఇప్పటికైనా ఆ విషయం గురించి స్పందించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

    జబర్దస్త్ కు గుడ్ బై  Sudigali Sudheer Sensational Decision