https://oktelugu.com/

Actress Sai Pallavi: పెళ్లి అప్పుడే అంటూ క్లారిటీ ఇచ్చిన నటి సాయి పల్లవి… ఎప్పుడంటే ?

Actress Sai Pallavi: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరోయిన్​ పేరు సాయి పల్లవి. ఫిదా సినిమాతో కుర్రాళ్ల గుండెళ్లో గుబులు పుట్టించింది ఈ భామ. ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. దక్షణాది ప్రేక్షకులను ఫిదా చేస్తూ పలు భాషల్లో వరుస ఆఫర్స్ పట్టేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే […]

Written By: , Updated On : January 5, 2022 / 05:32 PM IST
Follow us on

Actress Sai Pallavi: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరోయిన్​ పేరు సాయి పల్లవి. ఫిదా సినిమాతో కుర్రాళ్ల గుండెళ్లో గుబులు పుట్టించింది ఈ భామ. ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. దక్షణాది ప్రేక్షకులను ఫిదా చేస్తూ పలు భాషల్లో వరుస ఆఫర్స్ పట్టేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే తెలుగులో శ్యామ్ సింగ రాయ్ రూపంలో భారీ హిట్ పట్టేసింది. నానితో తెరపంచుకున్న ఆమె విమర్శకుల ప్రశంసలందుకుంది.

actress sai pallavi opens about her marriage news and gives clarity

అయితే తమ అభిమాన తారలు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు ? పెళ్లి తర్వాత వారి ప్లాన్స్ ఏంటి అనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు ఆడియన్స్. అందుకే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోహీరోయిన్లకు ఎక్కడోచోట పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురుకావడంతో సాయి పల్లవి తన పెళ్లి విషయమై నోరువిప్పింది.

పెళ్లి ఆలోచన ఇప్పుడు లేదని, 30 ఏళ్ళు దాటాకనే పెళ్లి గురించిన ప్రపోజల్స్ పరిశీలిస్తానని ఓపెన్‌గా చెప్పేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు కాగా… అప్పటి వరకు తన ఫోకస్ అంతా సినిమాల పైనే ఉంటుందని, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తానని అంటోంది సాయి పల్లవి. ప్రస్తుతం రానాతో ‘విరాటపర్వం’ మూవీ చేస్తూనే తమిళంలో మరో మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. ఈ రెండు సినిమాలు కూడా అతిత్వరలో ప్రేక్ష్హకుల ముందుకు రానున్నాయి.