Anasuya on Thalapathy Vijay: ఈమధ్య కాలం లో షో రూమ్ ఓపెనింగ్స్ కి , మూవీ ఈవెంట్స్ కి వెళ్లిన నిధి అగర్వాల్(Nidhi Agarwal), సమంత(Samantha Ruth Prabhu) వంటి స్టార్ హీరోయిన్లకు అభిమానుల నుండి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలను ఉద్దేశించి ప్రముఖ నటుడు శివాజీ మాట్లాడిన మాటల గురించి ప్రతీ రోజు న్యూ చానెల్స్ లో డిబేట్స్ నడుస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో కూడా అసలు ఆగడం లేదు. నెటిజెన్స్ పాత వీడియోస్ తవ్వుతూ శివాజీ పై కామెంట్స్ చేస్తున్న అనసూయ, చిన్మయి వంటి వారిని నిలదీస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్ ఇలయథలపతి విజయ్(Thalapathy Vijay) మలేషియా లో ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.
ఈ ఈవెంట్ కి వచ్చిన అభిమానుల సంఖ్యని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. విజయ్ కి మలేషియా లో ఇంత క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే ఆయన మలేషియా నుండి చెన్నై కి తిరిగి రాగా, విమానాశ్రయం లో విజయ్ వస్తున్నాడనే సమాచారం తెలుసుకొని వందల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆయన బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సమయం లో ఒక్కసారిగా అందరూ మీద పడడంతో క్రింద పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి అనసూయ రియాక్షన్ ఇస్తూ ‘నేనేమి అనట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇది పరోక్షంగా శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నమాట. ఆయన ఏమన్నాడంటే లుల్లూ మాల్ లో ‘రాజా సాబ్’ మూవీ ఈవెంట్ కి వచ్చిన నిధి అగర్వాల్, పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లే జనాలు ఆమెపై అలా ఎగబడ్డారు అని అన్నాడు కదా, ఇప్పుడు విజయ్ మగవాడు, ఆయనపై ఎలా ఈ విధంగా అభిమానులు ఎగబడ్డారు అనేది ఆమె ఉద్దేశ్యం.
అంటే మేము పొట్టి దుస్తులు వేసుకోవడం అసలు సమస్యనే కాదు అనేది ఆమె చెప్పదల్చుకున్న మాట. సినీ సెలబ్రిటీలు ఇలా పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అది హీరో అయినా, హీరోయిన్ అయినా అభిమానులు ఇలా ఎగబడడం సర్వసాధారణం. హీరో పై ఎగబడ్డారో అనుకో, వాళ్ళ చొక్కా చిరిగిందే అనుకో, ఏముంది చొక్కా లేకుండానే వెళ్తారు. అదే హీరోయిన్ కి అలాంటి పరిస్థితి ఎదురైతే?, ఊహించడానికి కూడా కష్టం గా ఉంది కదూ. మొన్న నిధి అగర్వాల్ కి జరిగింది కూడా అదే. దాదాపుగా ఆమె ధరించిన పొట్టి దుస్తులు చిరిగిపోయేంత పని అయ్యింది. కారు ఎక్కినా తర్వాత ఆమె రియాక్షన్ ని చూసి ఎంత భయపడిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే శివాజీ నిండుగా చీర కట్టుకొని అలాంటి ఈవెంట్స్ కి వెళ్తే, ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇబ్బంది ఉండదు కదా అనేది ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని ఏకీభవించవచ్చు, లేదంటే డిబేట్ చేయొచ్చు, కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఒక్కడిని చేసి అందరూ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు విశ్లేషకులు.