https://oktelugu.com/

Vishnu Manchu: ఏమయ్యా మంచు.. ఏదేదో అన్నావ్, ఏమైపోయావ్ ?

Vishnu Manchu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. జగన్ కూడా దీనికి ఓకే చెప్పారు. అలాగే.. ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ కూడా ఇచ్చేలా జగన్ ను ఒప్పించారు. ఎలాగూ జీఎస్టీ మినహాయింపు కూడా ఉండనుంది. అదేవిధంగా వివాదాస్పదంగా మారిన ఆన్‌లైన్ టికెట్ అమలను ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించడం పై కూడా చర్చించారు. దీనికి […]

Written By:
  • Shiva
  • , Updated On : February 10, 2022 / 03:06 PM IST
    Follow us on

    Vishnu Manchu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. జగన్ కూడా దీనికి ఓకే చెప్పారు. అలాగే.. ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ కూడా ఇచ్చేలా జగన్ ను ఒప్పించారు. ఎలాగూ జీఎస్టీ మినహాయింపు కూడా ఉండనుంది. అదేవిధంగా వివాదాస్పదంగా మారిన ఆన్‌లైన్ టికెట్ అమలను ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించడం పై కూడా చర్చించారు. దీనికి కూడా జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

    Manchu Vishnu

    ఇక ఎవరూ ఊహించని విషయాల పై కూడా చిరు అండ్ టీమ్ జగన్ ను ఒప్పించింది. వాటిల్లో ప్రధానమైనవి పార్కులు, ప్రభుత్వ, చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ లకు అద్దె మినహాయింపు ఇవ్వడం… ఇది చిన్న సినిమాలకే కాదు.. పెద్ద సినిమాలకు కూడా గొప్ప రిలీఫ్. అలాగే చిరు సాధించిన మరో వండర్ ఏమిటంటే.. చిన్న, మధ్య సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతిని తీసుకురావడం. అదే విధంగా టాలీవుడ్‌కు పరిశ్రమ హోదా, ఏటా నంది అవార్డులు ఇచ్చేలా జగన్ ను ఒప్పించారు.

    Also Read: జగన్ తో ఈ రోజు పరిష్కారం దొరికింది – చిరంజీవి

    మొత్తమ్మీద సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగేలా అన్ని విధాలా ఆలోచించి జగన్ తో చర్చలు జరిపారు. ఇవ్వన్నీ కేవలం చిరంజీవి సాధించి పెట్టిన గొప్ప ఘనతలు అనుకోవచ్చు. అయితే.. ఇప్పుడు నెటిజన్లు మంచు విష్ణు పై విరుచుకుపడుతున్నారు. మెగాస్టార్’ పై విష్ణు సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘చిరంజీవి, జగన్ లది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్‌ తో సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నిజంగా మెగాస్టార్ ను కూడా బాధ పెట్టాయి.

    నిజానికి మీటింగ్ కి వెళ్లబోయే ముందు, వెళ్లి వచ్చిన తర్వాత కూడా చిరు చాలా స్పష్టంగా చెప్పారు. సినిమా బిడ్డగా టికెట్ రేట్లు విషయం గురించి చర్చించడానికి వచ్చాను అని. అయినా విష్ణు పై విధంగా మాట్లాడే సరికి మెగా ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. ఇక ఈ రోజు చిరు, మహేష్ ను ప్రభాస్ ను వెంటబెట్టుకుని వెళ్లి.. మొత్తానికి సినిమా సమస్యలను తీర్చే ప్రయత్నం చేశారు. జగన్ కూడా సానుకూలంగా ఉండటంతో సమస్య పరిష్కారం దొరికినట్లు అయింది.

    CM Jagan-Chiranjeevi

    దాంతో ఇప్పుడు మధ్యలో విష్ణు బుక్ అయ్యాడు. ఏమయ్యా మంచు బాబు.. ఏదేదో అన్నావ్ ? ఏమైపోయావ్ ?, చిరు కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు. అంటూ మంచు విష్ణు పై విరుచుకుపడ్డారు అభిమానులు. అయితే నిన్నటి వరకూ మంచు విష్ణు మీడియా ముందు బాగా హడావుడి చేశాడు. కానీ ఈ రోజు మాత్రం మరీ న‌ల్ల‌పూసైపోయినట్టు ఎక్కడా కనబడలేదు. మొత్తమ్మీద మీడియా ముందు హైలైట్ కావడానికి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసి.. చివరకు ఇలా బుక్ అయ్యాడు విష్ణు.

    Also Read: జగన్ తో చిరు, మహేష్, ప్రభాస్ చర్చించింది వీటి గురించే !

    Tags