AP Tenth Inter Exams 2022: ఏపీలో ఏప్రిల్ 8 నుంచి ఇంట‌ర్, మే 2 నుంచి ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం

AP Tenth Inter Exams 2022: ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ప‌రీక్ష‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇందుకు గాను షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు తేదీలు విడుద‌ల చేసింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం ముందుకు వెళ్ల‌డానికి సిద్ధ‌మైంది. గ‌త రెండేళ్లుగా క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ముందుకు సాగ‌క‌పోవ‌డంతో ఈసారి విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. దీనికి గాను పాఠ‌శాల‌ల‌కు కూడా సెల‌వులు మంజూరు చేయ‌కుండా త‌ర‌గ‌తులు నిర్వ‌హించింది. దీంతో ప్ర‌భుత్వం ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి […]

Written By: Srinivas, Updated On : February 10, 2022 3:19 pm
Follow us on

AP Tenth Inter Exams 2022: ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ప‌రీక్ష‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇందుకు గాను షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు తేదీలు విడుద‌ల చేసింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం ముందుకు వెళ్ల‌డానికి సిద్ధ‌మైంది. గ‌త రెండేళ్లుగా క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ముందుకు సాగ‌క‌పోవ‌డంతో ఈసారి విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. దీనికి గాను పాఠ‌శాల‌ల‌కు కూడా సెల‌వులు మంజూరు చేయ‌కుండా త‌ర‌గ‌తులు నిర్వ‌హించింది. దీంతో ప్ర‌భుత్వం ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి వారిలోని ప్ర‌తిభా పాట‌వాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

AP Tenth Inter Exams 2022

మే 2నుంచి 13 వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. దీనికి గాను షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 8 నుంచి 28 వ‌ర‌కు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్ మాత్రం మార్చి 11 నుంచి 31 వ‌ర‌కు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌ణాళిక ప్ర‌క‌టించింది. విద్యార్థుల‌ను సిద్ధం చేయాల‌ని సూచించింది.

AP Tenth Inter Exams 2022

Also Read: హాట్ టాపిక్ గా వ‌రుణారెడ్డి పేరు.. వివేకా హ‌త్య కేసు నిందితుల గుండెల్లో గుబులు..?

పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఉదయం 9 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు జ‌రిపేందుకు నిర్ణ‌యించారు.దీంతో విద్యార్థుల‌కు పాఠ్యాంశాలు త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్లాల‌ని సూచించారు.అప్పుడే ప‌రీక్ష‌ల‌నిర్వ‌హ‌ణ‌కు ఆటంకాలు ఉండ‌వ‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కే ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను సూచించారు. మాస్కులు ధ‌రించాల‌ని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈసారి ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని చూస్తోంది. అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అన్నిచ‌ర్య‌లు తీసుకుంటోంది.

Also Read: ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటి

Tags