https://oktelugu.com/

Gabbar Singh Re Release : గబ్బర్ సింగ్’ థియేటర్ లోపలకి వరద నీళ్లు..అయినా కూడా ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్..వైరల్ అవుతున్న వీడియో!

ఈరోజు సోషల్ మీడియా లో ఒక వింత వీడియో తెగ వైరల్ గా మారింది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో 'గబ్బర్ సింగ్' ప్రదర్శితమవుతున్న థియేటర్ లోకి వరద నీరు వచ్చేసింది. అయినప్పటికీ కూడా అభిమానులు ఏమాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 4, 2024 / 09:30 PM IST

    Gabbar Singh Re Release (1)

    Follow us on

    Gabbar Singh Re Release :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోని ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సౌత్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇలాంటి దైవారాధన తో సమానమైన అభిమానం ఉంది. ఆయన చేసిన సినిమాల సంఖ్య ఇతర హీరోలతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ కూడా అభిమానులు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. 2019 ఎన్నికలలో ఘోర ఓటమి చెందినప్పటికీ కూడా అభిమానులు ఆయన వెంటనే నిలిచారు. 5 ఏళ్ళు ఆయనతో పాటుగా ఓటమి భారాన్ని, అవమానాన్ని అనుభవించారు. ఈ ఎన్నికలలో 100 స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ ని గెలిపించి సత్తా చాటారు. పవన్ కళ్యాణ్ ని ఉపముఖ్యమంత్రిని చేసారు. ఉపముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పుట్టినరోజు కావడంతో మొన్న రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయేలా ఏ రేంజ్ లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    ఈ సందర్భంగా అభిమానుల కోసం విడుదల చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి రీ సౌండ్ వచ్చే రేంజ్ లో రికార్డ్స్ పెట్టారు. మొదటి రోజు ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఒకపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బయటకి అడుగు కూడా పెట్టలేని పరిస్థితి, అలాంటి సందర్భంలో కూడా అభిమానులు థియేటర్స్ కి క్యూలు కట్టారు. ఈరోజు సోషల్ మీడియా లో ఒక వింత వీడియో తెగ వైరల్ గా మారింది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ‘గబ్బర్ సింగ్’ ప్రదర్శితమవుతున్న థియేటర్ లోకి వరద నీరు వచ్చేసింది. అయినప్పటికీ కూడా అభిమానులు ఏమాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో సినిమాలకు వసూళ్లు బాగా తగ్గుతుంటాయి, కానీ గబ్బర్ సింగ్ చిత్రానికి మాత్రం జనాలు ప్రతికూల పరిస్థితులను పక్కకి తోసి సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ రప్పించారు.

    ఇది కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్టామినా అని సోషల్ మీడియా లో అభిమానులు ఆ వీడియోని పోస్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘గబ్బర్ సింగ్’ చిత్రం రీ రిలీజ్ హిస్టరీ లోనే ఆల్ టైం ఇండియన్ రికార్డు గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ముందు మురారి చిత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పగా, ఆ రికార్డుని గబ్బర్ సింగ్ చిత్రం కేవలం మొదటి రోజే దాటేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా కేవలం టాలీవుడ్ లో మాత్రమే ఆల్ టైం రికార్డు కాదు, ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు విడుదలైన అన్ని రీ రిలీజ్ చిత్రాలకంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టి విజయ్ గిల్లీ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.