https://oktelugu.com/

Bigg Boss telugu 8 : ‘బిగ్ బాస్ 8’ లో మొదలైన ప్రేమాయణం.. నన్ను ప్రేమించు ప్లీజ్ అంటూ వెంటపడుతున్న విష్ణు ప్రియ!

ఆ మరుసటి సీజన్ లో సిరి, షణ్ముఖ్ ప్రేమాయణం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటుగా, బయట చూసే ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగించింది. ఎందుకంటే వీళ్లిద్దరికీ బయట పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2024 / 09:07 PM IST

    Bigg Boss telugu 8: Vishnu Priya asked Prithviraj

    Follow us on

    Bigg Boss telugu 8 : గత బిగ్ బాస్ సీజన్స్ లో లవ్ స్టోరీలు తెగ నడిచేవి. సీజన్ 4 మరియు సీజన్ 5 లో ఈ మోతాదు చాలా ఎక్కువగా ఉండేది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అదిరేవి. సీజన్ 4 లో అభిజిత్, మోనాల్ మరియు అఖిల్ మధ్య నడిచిన త్రైయాంగిల్ లవ్ స్టోరీ బంపర్ హిట్ అయ్యింది. ఆ మరుసటి సీజన్ లో సిరి, షణ్ముఖ్ ప్రేమాయణం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటుగా, బయట చూసే ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగించింది. ఎందుకంటే వీళ్లిద్దరికీ బయట పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి. అయినప్పటికీ కూడా వీళ్లిద్దరు ఆ విషయాన్ని మర్చిపోయి రెచ్చిపోయి రొమాన్స్ చేసుకున్నారు. దీని ప్రభావం షణ్ముఖ్ వ్యక్తిగత జీవితం పై పడింది. అతని ప్రేయసి దీప్తి సునైనా లవ్ బ్రేకప్ ని ప్రకటించింది. అదే సీజన్ లో మానస్ మరియు ప్రియాంక మధ్య కూడా ఒక లవ్ ట్రాక్ నడిచింది. ఇక తర్వాత సీజన్ 6 మరియు సీజన్ 7 లో ఇలాంటి లవ్ ట్రాక్స్ నడవలేదు కానీ, సీజన్ 8 లో నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీవీలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో యాంకర్ గా పనిచేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న విష్ణు ప్రియా, తన తోటి కంటెస్టెంట్ పృథ్వీ రాజ్ పై కన్నేసింది.

    అతనికి వంటింట్లో కోరింది వండిపెడుతూ అతని వెనుక తిరుగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో పృథ్వీ రాజ్ కి వంటింట్లో కాఫీ చేసి ఇచ్చింది. ఆ తర్వాత అతనితో మాట్లాడుతూ ‘నీకు మంచి కాఫీ పెట్టి ఇచ్చాను..నన్ను ప్రేమించొచ్చుగా’ అని అడుగుతుంది. దానికి పృథ్వీ రాజ్ ‘కాఫీ పెట్టించి ఇచ్చినందుకు ప్రేమించేస్తారా’ అని కౌంటర్ ఇస్తాడు. అది ఆమె సరదాగా అనిందో, లేదా సీరియస్ గానే అనిందో తెలియదు కానీ ఒక అమ్మాయి అయ్యుండి పబ్లిక్ గా ఒక అబ్బాయిని ప్రేమించు ప్లీజ్ అని అడగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఈ సీజన్ లో లవ్ ట్రాక్ రాబోయే రోజుల్లో కచ్చితంగా ఉంటుందని ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

    ఇది ఇలా ఉండగా ఈ సీజన్ లో కెప్టెన్స్ ఉండరు అనే విషయాన్ని మొదటి రోజే తెలియచేసాడు హోస్ట్ నాగార్జున. కెప్టెన్స్ ఉండరు కానీ, చీఫ్స్ ఉంటారు. ఈ వారం చీఫ్స్ గా నిఖిల్, యష్మీ, నైనికా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ ప్రక్రియ కూడా వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు బెజవాడ బేబక్క, విష్ణు ప్రియా, నాగ మణికంఠ, పృథ్వీ రాజ్, శేఖర్ బాషా, సోనియా తదితరులు నామినేట్ అయ్యారు. వీరిలో అందరు స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతే కాదు ఈ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకరిని హౌస్ లోకి పంపబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

    వీడియోను కింద ఇది క్లిక్ చేసి లింక్ లో చూడొచ్చు