Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నటించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో అట్టహాసంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆయన చివరిసారిగా ‘నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. మళ్ళీ ఇన్నేళ్లకు ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన పాల్గొనబోతున్నాడు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొంటుండడంతో అభిమానులు అసంఖ్యాకంగా రాజమండ్రి సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లు లక్షకు పైగా పాసులు అందించారట. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెండు లక్షలకు పైగా హాజరయ్యారట. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇంకా సభా ప్రాంగణం వద్దకు రాలేదు.
వాళ్ళు రాకముందే ఈ రేంజ్ జనాలు వచ్చారంటే , ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో జన సమీకరణ జరగబోతుందో ఊహించుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పాల్గొంటున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కావడం తో స్వయంగా పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాడు. 400 మంది పోలీస్ అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది సభా ప్రాంగణం వద్ద జనాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. కానీ వాళ్ళ వల్ల అవ్వడం లేదు. దీంతో అదనపు పోలీసు బలగాలను కూడా దింపారు. వాస్తవానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కువ ఆలస్యం చేయకుండా, కేవలం 6 నుండి 8 గంటలలోపు పూర్తి చేయాలనీ అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే 9 వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాగేలా అనిపిస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రసంగాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
రెండు రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ టీం ఎక్కువగా మాట్లాడలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అన్ని మాట్లాడుతామని చెప్పారు. మరి సినిమా గురించి ఏమి మాట్లాడబోతున్నారో చూడాలి. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ తో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటులు కూడా హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సుజిత్ కూడా ఈ ఈవెంట్ కి రాబోతున్నాడట. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడే మాటల కోసం పవన్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓజీ చిత్రానికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది మరి. ఆ సినిమా పేరు ఎత్తితేనే అభిమానులు పూనకాలొచ్చి ఊగిపోతున్నారు. ఇక ఈరోజు ఎలా ఉండబోతుందో చూడాలి.