https://oktelugu.com/

TV Serial : సూపర్ హిట్ సీరియల్ కి చెత్త ముగింపు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్! డైరెక్టర్ కి ఆ మాత్రం తెలియదా?

కార్తీకదీపం తర్వాత బుల్లితెరపై అంతటి క్రేజ్ దక్కించుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. డిసెంబర్ 7వ తేదీ 2020లో స్టార్ మా లో ఈ ధారావాహిక ప్రారంభం అయింది. నాలుగేళ్లుగా విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి శుభం కార్డు పడబోతోంది. గుప్పెడంత మనసు ని క్లోజ్ చెయ్యొద్దు బాబోయ్ అని ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సీరియల్ ని హడావిడిగా డైరెక్టర్ ముగించేస్తున్నారు. పోనీ ఆ ఎండింగ్ అయినా కరెక్ట్ గా ఉందా అంటే లేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 25, 2024 / 06:13 PM IST

    Guppedantha Manasu serial Ending

    Follow us on

    TV Serial :  సీరియల్ క్లోజ్ చేయాలి కాబట్టి సంబంధం లేని లాజిక్కులతో క్లైమాక్స్ కన్ఫ్యుజింగ్ గా మార్చేశారు దర్శకుడు. గుప్పెడంత మనసు సీరియల్ కి జనాల్లో ఓ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా సీరియల్ కి ప్రాణమైన రిషి, వసుధారల పాత్రలు జనాల్లో బాగా వెళ్లాయి. మహేంద్ర, జగతి, శైలేంద్ర, దేవయాని, ధరణి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి చాలా ప్రాధాన్యత ఉంది. వసు – రిషి జంట చూడ ముచ్చటగా ఉంటుంది. సీరియల్ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో జగతి పాత్ర చేస్తున్న జ్యోతి రాయి తప్పుకుంది.

    జగతి చనిపోయినట్లు చూపించారు. ఆ తర్వాత రిషి కొన్నాళ్ళు కనిపించకుండా పోయాడు. ఆ సమయంలో సీరియల్ ని ముందుకు నడిపించేందుకు మను, అనుపమ క్యారెక్టర్స్ ని దింపారు. కథని ఎన్ని మలుపులు తిప్పినా రిషి లేకపోవడంతో తేలిపోయింది. మను తండ్రి ఎవరు అనే ఒక అంశం తెరపైకి తీసుకొచ్చి సీరియల్ నడిపిస్తూ వచ్చారు. ఇంతలో రిషి రంగగా రీ ఎంట్రీ ఇవ్వడం. రిషి వసుధార కలిసిపోవడం. శైలేంద్ర ఆట కట్టించి డి బి ఎస్ టి కాలేజ్ కి రిషి ఎండి అవ్వడం చకచకా జరిగిపోయింది.

    రంగా నే తన రిషి అని వసుధార నమ్మకం నిజం అయింది. రిషి ఎందుకు రంగా గా మారాల్సి వచ్చింది. ప్రాణానికి ప్రాణమైన వసుధారను, మహేంద్ర ని వదిలేసి ఇంత కాలం ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది ప్రశ్న. అయితే శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో దీనికి క్లారిటీ ఇచ్చారు. రిషి, రంగగా మారిన సీన్ అయితే అస్సలు సంబంధం లేకుండా ఉంది. ఏదో ఒక కారణం చెప్పాలి కదా అని చెప్పినట్లు అనిపించింది.

    మెయిన్ లాజిక్ మిస్ అయింది. ఎందుకంటే రిషిని వసుధార వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఒక ఫ్యామిలీ ఉంది. ఊరంతా రంగ గురించి గొప్పగా వసుధారకు చెప్పారు. రంగా ఎంతో మంది చిన్నపిల్లలను చదివిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అతనిది గొప్ప మనసు అని చెప్పుకొచ్చారు. శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో మాత్రం రంగ చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాడు అని చూపించారు.

    ఇక ఫ్యామిలీ కోసం రంగ తిరిగి వస్తుండగా రిషి ని కాపాడాడని .. ఆ ప్రమాదంలో రంగా కోమాలోకి వెళ్లాడని .. రంగ కుటుంబం కోసం రిషి ఆ ఊరికి వెళ్ళాడు అని సింపుల్ గా తేల్చేశారు. చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి రంగా పారిపోతే మరి ఊరిలో వాళ్లంతా రంగా చిన్నప్పటి నుండి తెలుసని ఎలా చెబుతారు? బుజ్జి గాడు అన్నా అని ఎలా పిలుస్తాడు? సరోజ చిన్నప్పటి నుండి బావ పైనే ఎందుకు ఆశలు పెంచుకుంది? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ముగింపులో లాజిక్ మిస్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది.