BIgg Boss 9 Telugu Ramu Rathod Elimination: ‘బిగ్ బాస్ సీజన్ 9’ చాలా మంచి పాపులారిటీని సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్లు షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికి షో మీద మాత్రం ప్రేక్షకులకు మంచి నమ్మకం ఏర్పడింది. రోజు రోజుకి ఈ షో ను చూసే వల్ల సంఖ్య పెరిగిపోయింది. ఇక దానికి తోడుగా చాలామంది కంటెస్టెంట్లు వాళ్ల ఓన్ స్టైల్ లో ముందుకు సాగుతూ ఉండటం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాంతో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఓటింగ్స్ వేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే నిన్న జరిగిన ఎపిసోడ్లో రాము రాథోడ్ తను సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం మీద ప్రేక్షకుల్లో పలు రకాల ధోరణిలైతే వ్యక్తమవుతున్నాయి. కారణమేమిటి అంటే అతన్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన ప్రేక్షకుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఆయన ఎలిమినేట్ అయిపోవడం అనేది నిజంగా ప్రతి ఒక్క రాము రాథోడ్ అభిమానిని తీవ్రమైన నిరాశకు గురిచేస్తోంది. కారణం ఏంటి అంటే ఆయన హోం సిక్ అవ్వడంతో తను ఆ హౌజ్ లో ఉండలేకపోతున్నాడు. నిజానికి ఆయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు అన్ని రోజులపాటు తన ఫ్యామిలీని వదిలేసి ఉండలేదని అందువల్లే ఇప్పుడు ఉండలేకపోతున్నానని చెప్పాడు.
దాంతో తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎలిమినేట్ అయ్యేవాడు ఎందుకని బిగ్ బాస్ షో కి రావడం ఎందుకని ప్రేక్షకుల యొక్క అటెన్షన్ ను రాబట్టుకొని తనని అభిమానించేలా చేసుకోవడం, చివరికి హ్యాండ్ ఇచ్చి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్ళిపోవడం…
ఎందుకు ఇదంతా అంటూ మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజానికి రాము రాథోడ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం తన ఫ్యామిలీని వదిలేసి ఒంటరిగా ఉండలేకపోతున్నాడు. దానివల్ల అతను లోన్లీగా ఫీల్ అయి బయటికి వచ్చేయాలని అనుకున్నాడు.
దాంట్లో తప్పేముంది? ప్రేక్షకులు అభిమానించడం తప్పులేదు కానీ ఆయన అక్కడ ఇవ్వడలేకపోతున్నప్పుడు అందులో నుంచి బయటికి వచ్చే హక్కు తనకు ఉంటుంది కదా అంటూ అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.ఇక మొత్తానికైతే రాము రాథోడ్ ఇలా చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…