NTR 30: #RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవ్వలేదు.. కొరటాల శివ తో ఒక సినిమా , ప్రశాంత్ నీల్ తో మరో సినిమా అధికారికంగా ప్రకటించారు కానీ..ఇప్పటి వరకు ఆ రెండు సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు..దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో తీవ్రమైన అసహనం ఏర్పడింది.

అయితే కొరటాల శివ తో ప్రారంభం అయ్యే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందని..సంక్రాంతి కి పూజ కార్యక్రమాలు చేసి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని ఒక టాక్ జోరుగా ప్రచారం సాగింది..న్యూ ఇయర్ రోజు ఈ చిత్రం గురించి ఒక్క చిన్న అప్డేట్ అయినా వస్తుందని అభిమానులు ఆశించారు..కానీ మేకర్స్ నుండి ఉలుకూ పలుకూ లేదు..దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వెర్రెత్తి వెంటనే ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చెయ్యాలంటూ #NTR30 హ్యాష్ టాగ్ పై ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే నెలలో ఈ సినిమాకి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.. ఆ తర్వాత నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.. మధ్యలో ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి.. కానీ మూవీ టీం వెంటనే ఆ వార్తలపై స్పందించి త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చింది..ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.. ఇటీవలే ఆమెని సంప్రదించి మేకర్స్ భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు..ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట..మూవీ బ్యాక్ డ్రాప్ మొత్తం అండర్ వాటర్ నేపథ్యం లో సాగుతుందట..పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట మేకర్స్