Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోలకంటే సూపర్ స్టార్ మహేశ్ కే ఫ్యాన్స్ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన నిత్యం అభిమానులతో అందుబాటులో ఉంటాడు. మహేశ్ ఫ్యాన్స్ ఇచ్చే కొన్ని సూచనలను ఆయన పాటిస్తారని సమాచారం. అయితే ఇటీవల ఫ్యాన్స్ కు నచ్చని పనిచేస్తున్నారట. దీంతో వారు అలాంటి సినిమాలు చేయొద్దని కోరుతున్నారు. అలా చేయడం వల్ల క్రేజ్ తగ్గిపోతుందని చెబుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి మహేశ్ వరుస హిట్లు కొడుతున్నాడు. తాజాగా త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనపై ఫ్యాన్ష్ ఇలా మెసేజ్ లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

మహేశ్ లేటేస్టుగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఇటీవలే ఫైనల్ అయింది. మరి కొద్దిరోజుల్లు సెట్స్ పైకి వెళ్లనుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి ‘సర్కారు వారి పాట’ వరకు మహేశ్ హ్యాట్రిక్ సక్సెస్ సాధించాడు. సరిలేరు నీకెవ్వరు నుంచి వచ్చిన మూడు సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలే. దీంతో ఫ్యాన్స్ మహేశ్ ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంపై కాస్త నిరాశతో ఉన్నారట. అందుకే ట్రెండ్ మార్చాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ఇందులో భాగంగా DoNotMakeMsgMovies అనే యాష్ టాగ్ పెట్టి మరీ పోస్టులు పెడుతున్నాడట. ఏన్నో ఏళ్లుగా మహేశ్ ఫ్యాన్స్ సినిమాలను ఆదరిస్తున్న ఫ్యాన్స్ కోసం మహేశ్ ఒక్కోసారి మనసు మార్చుకున్న రోజులున్నాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకుంటున్న విధంగా మహేశ్ మెసేజ్ సినిమాలను వదిలేస్తాడా..? లేదా..? అనేది చూడాలి. అయితే ఈ సినిమా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో పడుతూ వస్తోంది. ఇటీవలే సెట్ పైకి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మహేశ్ నిర్ణయం మార్చుకునే అవకాశం లేదు.

అయితే వచ్చే సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. గతంలో మహేశ్ ఫ్యామిలీ, యాక్షన్ మూవీస్ ఎక్కువగా చేసేవారు. ఫ్యాన్స్ కూడా మహేశ్ ను అలాంటి మాస్ క్యారెక్టర్లో చూసి మురిసిపోయారు. ఇప్పుడు సాదాసీదా ఫేస్ తో మహేశ్ ను చూడడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఇప్పటికైనా పాన్ ఇండియా లెవల్లో మాస్ మూవీస్ చేయాలని కోరుతున్నారు. అయితే మహేశ్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోచూడాలి.