Superstar Krishna- Continental Hospitals: సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు తీవ్రమైన అస్వస్థత కారణంగా హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరినట్టు వచ్చిన వార్తలు అభిమానులను కలవరపెట్టాయి..అభిమానులందరూ ఆందోళన చెందుతున్న సమయం లో నరేష్ మాట్లాడుతూ కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా ఉందని..రెగ్యులర్ చెకప్ నిమిత్తమే ఆయన హాస్పిటల్ కి వచ్చారని..అభిమానులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు.

కానీ హాస్పిటల్ డాక్టర్లు చెప్పింది దానికి పూర్తిగా రివర్స్ లో ఉంది..’కృష్ణ గారికి గుండెపోటు వచ్చింది..ఆయన కోడలు నమ్రత గారు ఆయనని నిన్న రాత్రి మా హాస్పిటల్ లో చేర్చారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది..ICU లో వెంటిలేటర్ మీద అత్యవసర చికిత్స అందిస్తున్నాము..ఆయన ఆరోగ్యం గురించి తదుపరి ప్రకటన 24 నుండి 48 గంటల్లో నివేదిక అందిస్తాము..ఆయన కండిషన్ క్రిసీటికల్ గానే ఉంది’ అంటూ అధికారికంగా మీడియా కి తెలిపారు..ఆయన కండిషన్ క్రిటికల్ గానే ఉందని డాక్టర్లు అధికారికంగా మీడియా కి తెలపడం తో అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురైయ్యారు.

కృష్ణ గారి తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు ఉదయం హాస్పిటల్ కి చేరుకున్నాడు..ఈ ఏడాది వరుసగా తన అన్నయ్య రమేష్ బాబు మరియు తల్లి ఇందిరా దేవి గార్లు చనిపోవడం తో మహేష్ బాబు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..ఆ బాధ మాటల్లో వివరించలేనిది..ఈ రెండు దుర్ఘటనల నుండి మెల్లిగా బయటపడుతున్న సమయం లో ఇప్పుడు కృష్ణ గారికి ఇలా గుండెపోటు రావడం ఆయనకీ కోలుకోలేని దెబ్బ..కృష్ణ గారు సురక్షితంగా చికిత్స చేయించుకొని సంపూర్ణంగా అనారోగ్యం నుండి కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రత్యేకంగా ప్రార్ధనలు చేస్తున్నారు..మనం కూడా ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థిద్దాము.