హీరోయిన్ రష్మికకు ఓ అభిమాని నుంచి చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని ఏకంగా అమ్మడిని ముద్దుపెట్టారు. దీంతో షాకైన రష్మిక తేరుచుకునేలోపే ఆ అభిమాని అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడనున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో రష్మిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ వీడియోను తొలగించారు.
ఇటీవల ‘సరిలేరునికెవ్వరు’లో మహేష్ కు జోడీగా నటించి ఆకట్టుకుంది. గ్లామర్ తో పాటు నటనపరంగా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. రష్మిక మహేష్ బాబుతో చేరిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ రష్మిక కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తాజాగా నితిన్ తో కలిసి ‘బీష్మ’లో నటించింది. ఈ మూవీలోని ‘వాటే వాటే బ్యూటీ’ సాంగ్లో రష్మిక డాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ మూవీ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రష్మిక కుక్క బిస్కట్లు తిట్టుందని నితిన్ మీడియా ముందు సరదాగా చెప్పాడు. దీన్ని కొందరు సోషల్ మీడియాలో రష్మికపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పట్లో ట్రోలింగ్ తో ఇబ్బందిపడుతున్న రష్మిక ఓ అభిమాని చేసిన పనివాళ్ల ఇబ్బంది పడింది. సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమాని రష్మికను చూసిన ఆనందంలో కంట్రోల్ తప్పి ముద్దు పెట్టుకోవడం.. అదంతా అక్కడి వారు వీడియో తీసి నెట్లో పెట్టడంతో వైరల్ అయింది. అయితే అభిమానుల విషయంలో హీరోయిన్లు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. రష్మిక నిర్లక్ష్యం వల్లే ఆ అభిమాని ముద్దుపెట్టుకొని పారిపోయాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా రష్మిక మందన్న అభిమానుల విషయంలో జాగ్రత్తగా ఉంటుందో లేదో చూడాలి.