Shabdham Trailer: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఆది పినిశెట్టి (Aadi Pinishetty) లాంటి హీరో అయితే రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలను చేయకుండా డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ‘శబ్దం ‘ (Shabdham) అనే సినిమాతో మరోసారి ప్రేక్షక ముందుకు వస్తున్నాడు ఇక ఈ సినిమాతో ఆయన ఒక మంచి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సినిమా సౌండ్ కు సంబంధించి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీగా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. అంటే మనిషి వినికిడిలో కొన్ని సౌండ్స్ బాగుంటే మరికొన్ని భరించరాని సౌండ్ ను కలిగించే విధంగా ఉంటాయి. మరి అలాంటి సౌండ్స్ ని క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతున్న ఒక ముఠాని పట్టుకోడానికి హీరో ఒక ఇన్వెస్టిగేషన్ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఆయనకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? కావాలని ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారా అనే దానికోసమే ఈ సినిమా సాగినట్టుగా తెలుస్తోంది. ఇంక విజువల్స్ విషయానికి వస్తే ట్రైలర్ లో విజువల్స్ ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్యారెక్టర్జేషన్ ను డెలివర్ చేసిన విధానం కూడా చాలా బాగుంది.
బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అద్భుతంగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇదొక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా అనే విషయమైతే అర్థమైపోతుంది. మరి ఈ సినిమాతో ఆది విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. గతంలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసిన ఆది వాటి వల్ల ఎక్కువగా సక్సెస్ లను సాధించలేకయాడు.
కానీ ఈ సినిమాతో మాత్రం మంచి సక్సెస్ ని సాధిస్తానని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ట్రైలర్ లో సస్పెన్స్ హర్రర్ గొలిపించే సన్నివేశాలైతే చాలా బాగున్నాయి. కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసే వాళ్ళకి ఈ సినిమా చాలా మంచి బూస్టప్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది… అయితే వాళ్లు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికి ఇందులో సస్పెన్స్ పెద్దగా వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఎందుకంటే కథ మొత్తం ముందే చెప్పేశారు కాబట్టి సస్పెన్స్ సీన్స్ అంత కిక్ ఇవ్వకపోవచ్చు…..ఫిబ్రవరి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుంది? తద్వారా ఈ సినిమాతో ఆది పినిశెట్టి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
