https://oktelugu.com/

Sandeep Kishan : సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెన్సార్ సభ్యులు సినిమా చూసిన తర్వాత ఏమన్నారంటే!

బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక కనీసం మీడియం రేంజ్ మార్కెట్ ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరోలు మన ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు.

Written By: , Updated On : February 20, 2025 / 09:48 AM IST
Sandeep Kishan

Sandeep Kishan

Follow us on

Sandeep Kishan : బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక కనీసం మీడియం రేంజ్ మార్కెట్ ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరోలు మన ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సందీప్ కిషన్(Sandeep Kishan). తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను ఎదో ఒక విధంగా అలరించాలని చూస్తాడు, గొడ్డులాగా కష్టపడతాడు కానీ ప్రతిఫలం మాత్రం ఈ కుర్ర హీరోకి దక్కడం లేదు. కానీ గత ఏడాది విడుదలైన ‘భైరవకోన’ చిత్రం కమర్షియల్ గా హిట్ అనిపించుకున్నప్పటికీ, అది ఆయన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమాగా మాత్రం మారలేకపోయింది. ఇప్పుడు ఆయన ‘మజాకా'(Majaka Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ‘ధమాకా’ దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ నెల 26వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి అయ్యాయి.

సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం తర్వాత మరో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుందని, కచ్చితంగా కమర్షియల్ గా ఈ ఈఏడాది మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారట. రావు రమేష్ ఉన్న సన్నివేశాలన్నీ పొట్టచెక్కలు అయ్యేలా నవ్వించాయట. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కడుపుబ్బా నవ్వుకున్నామని, సందీప్ కిషన్ కెరీర్ లో ఈ చిత్రం అత్యంత భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. కేవలం రావు రమేష్ మాత్రమే కాదు, సందీప్ కిషన్, అలాగే హీరోయిన్ రీతూ వర్మ కూడా కామెడీ చితక్కోటేశారట. చాలా కాలం తర్వాత మన్మథుడు మూవీ హీరోయిన్ అన్షు రెడ్డి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఆమె కూడా స్క్రీన్ పై ఉన్నంతసేపు తనవైపు నుండి ది బెస్ట్ ఇచ్చిందని అంటున్నారు. ఇకపోతే మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ ని ఎలా చేయాలి అనే విషయం పై ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీం అనుసరించిన ప్యాట్రన్ ని అనుసరిస్తున్నారు. ఆ సినిమా జనాల్లోకి బాగా వెళ్లి, విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండడానికి కారణం ప్రొమోషన్స్. టీవీ లో ఏ ఛానల్ ని మార్చిన వాళ్ళే కనిపించేవారు. మజాకా చిత్రానికి కూడా ఆ రేంజ్ ప్రొమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి వీళ్లకు కూడా ఆ ప్రొమోషన్స్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ డైలాగ్స్, స్టోరీ ని అందించాడు. గతంలో ఆయన ‘ధమాకా’ చిత్రానికి కూడా స్టోరీ డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా లియోన్ జేమ్స్ వ్యవహరించాడు.