https://oktelugu.com/

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ తో పెళ్లిచూపులు.. యువ నటి మృతితో విషాదం

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ తో పెళ్లి చూపుల్లో పాల్గొన్న యువ నటి శ్రియా మురళీధర్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. 27 ఏళ్ల శ్రేయా ఇంత చిన్న వయసులోనే కన్నుమూయడాన్ని బుల్లితెర సెలబ్రెటీలు జీర్ణించుకోవడం లేదు. అనేక పాపులర్ షార్ట్ ఫిల్మ్ లలో నటించిన శ్రేయ మురళీధర్ ఫేమస్ అయ్యారు. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీప్తి సునయన, దేత్తడి హారిక, సుప్రియ వంటి ఇతర యూట్యూబర్ లు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 / 05:21 PM IST
    Follow us on

    Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ తో పెళ్లి చూపుల్లో పాల్గొన్న యువ నటి శ్రియా మురళీధర్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. 27 ఏళ్ల శ్రేయా ఇంత చిన్న వయసులోనే కన్నుమూయడాన్ని బుల్లితెర సెలబ్రెటీలు జీర్ణించుకోవడం లేదు.

    Shreya Muralidhar

    అనేక పాపులర్ షార్ట్ ఫిల్మ్ లలో నటించిన శ్రేయ మురళీధర్ ఫేమస్ అయ్యారు. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీప్తి సునయన, దేత్తడి హారిక, సుప్రియ వంటి ఇతర యూట్యూబర్ లు శ్రేయ మృతి పట్ల తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    శ్రేయ మరణం యూట్యూబర్స్ ను బాధించింది. పెద్దసంఖ్యలో అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాప సందేశాలు పెడుతున్నారు. నటన అనేది శ్రేయకు ఉన్న అభిరుచి. అందుకే టీవీ, సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించింది.

    సుమ కనకాల హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు పెళ్లికొడుకుగా మారి చేసిన రియాలిటీ షో ‘పెళ్లిచూపులు’ షోలో శ్రియా మురళీధరన్ ఒక కంటెస్టెంట్ గా పాల్గొంది. ప్రదీప్ తో పెళ్లిచూపుల్లో సరదాగా పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది.

    Also Read: ప్రముఖ యూట్యూబర్ శ్రియా మురళీధర్ హఠాన్మరణం…
    అనంతరం అనేక షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. ‘వాట్ ద ఫన్’ అనే యూట్యూబ్ ఛానెల్ లో కూడా శ్రేయ షార్ట్ ఫిల్మ్స్ ప్రసారమవుతున్నాయి. ఆమె ‘బ్యూటీ అండ్ ది బాస్’ అనే వెబ్ సిరీస్ 2వ సీజన్ లో ప్రస్తుతం నటించింది. చిన్న వయసులోనే శ్రియా గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఈ వార్తను ఆమె స్నేహితులైన దీప్తి సునయన, సుప్రియలు తట్టుకోలేక సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.

    Shreya Muralidhar

    Also Read: సింగర్ చిన్మయి కి మద్దతుగా నిలిచిన ఆ ఇద్దరు… ఎవరంటే ?