AR Rehman: ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. అయితే పిల్లలు ఎదగడం వారు అనుకున్న దారిలో ఎదగడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ముఖ్యమైంది. అలా విజయం సాధించిన వారిని చూసి తల్లిదండ్రులు మురిసి పోతుంటారు.పేరెంట్స్ గా అంతకు మించిన మంచి అనుభూతి మరోకటి ఉండదనే చెప్పుకోవాలి. ఇప్పుడు అదే అనుభూతిని పొందుతున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్.
Also Read: సింగర్ చిన్మయి కి మద్దతుగా నిలిచిన ఆ ఇద్దరు… ఎవరంటే ?
రెహమాన్ కూతుర్లు రహీమా రెహమాన్, ఖతీజా రెహమాన్ ఇద్దరూ సంగీతకారులుగా రాణిస్తున్నారు. ఇటీవల కృతి సనన్ నటించిన మిమి సినిమాలో రాక్ ఏ బై బేబీ పాటతో అదరగొట్టారు ఖతీజా. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో తన కూతుర్ల గురించి స్పందించాడు ఏఆర్ రెహమాన్. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీ కూతుర్లకు ఏమైనా సలహా ఇస్తారా అని అడగ్గా… రహీమా, ఖతేజా ఇద్దరిదీ మొండి మనస్తత్వం, వాళ్లు ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు అని చెప్పారు. ఈ క్రమంలో వాళ్లకు నేను పదే పదే చెప్పె విషయం ఒకటే. దేని గురించి దిగులు చెందకండి. చేయాలనుకున్న పనిని చేయండి. అప్పుడే మీకంటూ సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. ఇతరులతో పోల్చుకోవద్దు అని చెబుతాను అని రెహమాన్ అన్నారు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు 30-60 ఏళ్ల వయసు వాళ్లతో పనిచేశాను. వాళ్లందరి నుంచి నేను నేర్చుకున్న విషయమేంటంటే పని పట్ల నిబద్దత. ఇప్పుడు కూడా అదే విషయాన్ని తిరిగి యూత్ నుంచి నేర్చుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ను విచారించిన ఈడీ…