https://oktelugu.com/

Mega 154: మెగాస్టార్ చిరు సినిమాలో నటించేందుకు రవితేజ రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. జెట్ స్పీడ్ లో తన సినిమాలను కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చిరు – కరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 05:24 PM IST
    Follow us on

    Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. జెట్ స్పీడ్ లో తన సినిమాలను కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చిరు – కరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చిరు.

    hero ravi teja taking high amount to act in chiru – bobby movie

    ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం తెరకెక్కిస్తుండగా… ‘ గాడ్ ఫాదర్ ‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో సినిమా భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు చిరు. తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం మూవీకి రీమేక్ గా వస్తుంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి మెగాస్టార్ కమిట్ అయ్యాడు. మెగా 154 గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

    Also Read: మెగాస్టార్​ ఆల్​టైమ్ రికార్డ్​.. ఒకే నెలలో వరుసగా సెట్స్​పైకి నాలుగు సినిమాలు

    ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ తో కలిసి సందడి చేస్తాడని తెలుస్తుంది. రవితేజ ఒక్కో సినిమాకి 10కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట కానీ.. ఇప్పుడు అన్నయ్య చిరంజీవి సినిమాలో పాత్రను చేయడానికి 7 కోట్లు తీసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: బద్నామ్ చేస్తారా? ఆ మూడు న్యూస్ చానెల్స్ కు షాకిచ్చిన చిరంజీవి